ఇళ్ల పట్టల పంపిణీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. టిడ్కో లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లివ్వాలి అని ఆయన కోరారు. సెంటు సెంటున్నర ఇంటి స్థలం పేదలకు ఏం సరిపోతుంది..? అని నిలదీశారు. టిడ్కో ఇళ్ల పథకం నేను ప్రవేశపెట్టిన పథకం అని ఆయన స్పష్టం చేసారు. ఇంటికి లక్ష రూపాయలు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు.

ఫ్రస్ట్రేషనుతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అని, గాలి కబుర్లు చెపుతున్నారు అని విమర్శలు చేసారు. నా ఇల్లు నా సొంతం ద్వారా పేదలకు ఇల్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. ఇంటి పన్ను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు అని మండిపడ్డారు. దీన్ని మేం నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాం అన్నారు. రౌడీలు కంటే హీనంగా మాట్లాడుతున్నారు అని ఆయన విమర్శలు చేసారు. ఇది చట్ట సభలకు మర్యాద కాదు అని ఆయన అన్నారు. ఇదేమిటని అడిగితే స్పీకర్ నాపై పేపర్లు విసిరేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం పై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చింది అన్నారు. హౌస్ సైట్స్ కి మేముఅడ్డుపడుతున్నాం అన్నారు అని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అని నిలదీశారు. స్మశానాలు, అవ భూములు, మడ భూములు, అసైన్డ్ భూములు ఇస్తారా అని నిలదీశారు. ఎవరో కడుపుమండి కోర్ట్ కు వెళితే మాపై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇంటి స్థలాల విషయం లో  అవినీతి జరిగింది అన్నారు... విచారణ చేయండి అని సవాల్ చేసారు. టీడ్కో ఇల్లు విషయం లో మా ఇల్లు నా సొంతం పిలుపు ఇచ్చాను అని ఆయన పేర్కొన్నారు. ప్రజాలనుండి తిరుగుబాటు వచ్చింది ఇప్పుడు ఒక కేటగిరీ ఫ్రీ అంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. సెంట్ స్థలం ఇచ్చి ఏమి కడతారు... మేము గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చాము, నగరాల్లో 2 సెంట్స్ ఇచ్చాము అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: