ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మొన్నటిదాకా వివిధ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఇక ఇప్పుడు ఎగ్జిట్ పోల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు పలుచోట్ల గొడవలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. కూకట్ పల్లి 121 డివిజన్ దీన బంధు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూతు నెంబర్ 48 వద్ద జగద్గిరి గుట్ట సిఐ బూటు కాళ్లతో పోలింగ్ బూతు టేబుళ్లను తన్నాడు. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలను బూతు పదజాలంతో దూషిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూకట్‌పల్లి దీనబంధు కాలనీలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.

అసభ్య పదాలతో తిట్టడమే కాకుండా సీఐ అడిగిన వారిపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తల ఆరోపిస్తున్నారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎలక్షన్స్  పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగబోతుంది.  కొన్ని చోట్ల గొడవలు మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే సాగుతోంది. ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ 26లో పోలింగ్‌ రద్దు అయింది. ఆ ఎన్నికను ఎల్లండి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే ఓటర్లు ఎవరూ సరిగా ఓటింగ్ కోసం రాలేదు. సరిగా పోలింగ్ జగరలేదు. ఇంకా ఓటింగ్‌కు నాలుగున్నర గంటల సమయం మాత్రమే ఉంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...




మరింత సమాచారం తెలుసుకోండి: