ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఒక కొలిక్కి వస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళకూడదనే ఉద్దేశంలో ఏపీ ప్రభుత్వం ఉండగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తాను రిటైర్డ్ అయ్యేలోపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతే పంతంతో ఉన్నారు. అసలు ఏపీలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఎవరికీ తెలియని విషయంగా మారింది. జగన్ సైతం ఏదోరకంగా ఎన్నికలను వాయిదా పడేలా చేయాలని చూస్తున్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి అన్నట్లుగా ఆయన అన్ని విషయాలను క్లారిటీగా చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే , తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని పట్టుబడుతోంది. 




ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అండగా నిలబడుతోంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే zఅనంతపురం జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రమేష్ కుమార్ ఎన్నికల అధికారి గా పదవీ విరమణ చేసిన తరువాత మాత్రమే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినా, తాము ఇప్పట్లో ఎన్నికల నిర్వహణకు ముందుకు రావాలని ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ సైతం నిమ్మగడ్డ కు లేఖ రాశారు. 



ప్రభుత్వ అధికారులు నేటికీ కరోనా విధల్లో ఉన్నారని చీఫ్ సెక్రటరీ చెబుతున్నారు.జెసి దివాకర్ రెడ్డి మాత్రం మార్చి వరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఓకే చెప్పినా, ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టు కు వెళుతుందని, ఇక ఏకగ్రీవమైన నేతలు , నామినేషన్ దాఖలు చేసిన వారు ఎవరైనా కోర్టును ఆశ్రయించి , ఎన్నికల నిలుపుదల కోరే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం కోర్టు వ్యవహారాలు అన్ని తేలేటప్పటికి పుణ్య కాలం కాస్త అయిపోతుందని జెసి చెబుతున్నారు. జెసి కి ఉన్న క్లారిటీ బాబుకు ఎందుకు లేదు అనే ప్రశ్న ఇపుడు వైసిపి లేవనెత్తింది . ఇక ఎన్నికలు జరిగే అవకాశమే లేదు అనేది కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. దీంతో నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగే అవకాశమే కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: