జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల హంగామా ముగిసింది. మళ్లీ సేమ్‌ సీనే రిపీట్‌ అయింది. ఎప్పటిలాగే గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది.ఐతే ఈ సారి  గతంతో పోల్చితే ఈ సారి పోలింగ్‌ శాతం మరి తగ్గింది. సాయంత్రం 5గంటల వరకు కేవలం 36.73 శాతం ఓటర్లు మాత్రమే ఓటువేశారు.ఈ మధ్యాహ్నం 1గంట వరకు ఒక్కశాతం కూడా పోలింగ్‌ నమోదు కాని డివిజన్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పోలింగ్‌ పట్ల నగరవాసుల్లో ఎంత అనాసక్తి ఉందో ఈ పోలింగ్‌ శాతాన్ని బట్టే అర్థమవుతోంది.

మొత్తానికి  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్‌ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.అయితే చిన్న పొరపాటు వల్ల ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.అక్కడ 3 తేదీన రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది.ఆ తర్వాత పూర్తి స్థాయి పోలింగ్‌ వివరాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. కాగా, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాలేదని తెలుస్తోంది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్‌ నమోదైంది.మరి ఈ సారి అంతా కంటే తక్కువనే మొదలయ్యే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదిలా వుంచితే బల్దియా పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

 రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగింది. భాజపా అగ్ర నేతలు సైతం హైదరాబాద్‌ నగరానికి వచ్చి ప్రచారం హోరెత్తించడంతో రాజకీయం మరింతగా హీటెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో కనీసం ఈసారైనా పోలింగ్‌ 50శాతం దాటుతుందని అందరూ ఆశించినా.. గత రెండు ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం.మరి బల్దియా పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: