ఎట్టకేలకు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఈసారి పోలింగ్ శాతం దారణంగా నమోదు అయింది. గతంలో కన్నా తక్కువగా పోలింగ్ జరిగిందని అధికారులు, రాజకీయ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.పోలింగ్ కు ముందు అన్నీ రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలే అయినప్పటికి సార్వత్రిక ఎన్నికల వలె ప్రచారాన్ని హోరెత్తించాయి.పోలింగ్ తర్వాత ఓటింగ్ శాతాన్ని చూసి అన్నీ పార్టీలు కూడా ఒక్కసారిగా కంగు తిన్నాయి.

గ్రేటర్ లో ఎప్పుడు పోలింగ్ శాతం తక్కువగానే నమోదౌతుంది.అయితే ఈ సారి మరి అత్యంత తక్కువ నమోదు కావడం అన్ని పార్టీలను షాక్ కు గురిచేసిందని కొండ విశేశ్వరయ్య వ్యాఖ్యానించారు.ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

ఇంత తక్కువగా ఓటింగ్ నమోదు అవుతుందని తనకు కూడా తెలియదన్నారు. ఓటింగ్ శాతం తగ్గడం ఏ పార్టీకి మేలు చేస్తుందన్న విషయంపై కూడా స్పష్టత లేదన్నారు.ఒకవేళ ఓటింగ్ శాతం పెరిగి ఉంటే అది ఖచ్చితంగా అధికార పార్టీకి మాత్రం మైనస్ అవుతుందన్నారు. బిగ్ ఓటింగ్ టర్న్ అవుట్ అనేది రూలింగ్ పార్టీకి కష్టంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: