తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నాడు. సొంతంగా పార్టీ పెట్టి తమిళ రాజకీయాలను శాసించబోతున్నా అని ప్రకటించిన రజిని ఈ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వస్తుండడంతో , అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతుంది. తమిళనాడు ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు. అయినా రజిని ఇప్పటి వరకు పార్టీని స్థాపించే విషయంలో ఏ ప్రకటన చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రజిని ఇంకా ఏ విషయము తేల్చుక పోవడంతో,  ఆయనను బలహీనం చేసే విషయంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఆయన హవాను తగ్గించి, ఎన్నికలలో ఆయన ప్రభావం లేకుండా చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా రజిని పార్టీ స్థాపించినా, అధికార పార్టీ కంటే డిఎంకేకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకే ఎక్కువగా ఆ పార్టీ టెన్షన్ పడకుండా రకరకాల మార్గాల ద్వారా రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.



 తనను ఎవరు బెదిరించ లేదని, ఎవరు బెదిరించినా, తాను బెడిరిపోను అని అభిమానులకు వివరణ ఇచ్చుకున్నారు. సమయం వచ్చినప్పుడు పార్టీని ప్రకటిస్తానని ఆయన చెప్పడం తో ఇప్పటికే పిఎంకె వంటి పార్టీలు రజిని కూటమిలో లో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే రజనీ కు బిజెపి ముద్ర వేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమిత్ షా రజినీ కాంత్ ను కలవాలనుకున్నా, అది సాధ్యపడలేదు. దీంతో రజినీకి అత్యంత సన్నిహితులైన గురుమూర్తి తో సమావేశమయ్యారు.



 వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చే విషయమై , ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఒప్పించల్సిందిగా  గురుమూర్తి ని అమిత్ షా కోరినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగినా, ఆయన ఎక్కడా ఖండించకపోవడంతో ఇంకా అనుమానాలు బయలుదేరాయి. ఇంకా ఎన్నికలకు ఆరేడు నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో రజనీ పార్టీ పెడుతున్నారా లేక మరేదైనా పార్టీకి మద్దతు ఇస్తున్నరా ? ఇలా ఏ విషయమూ రజనీ తేల్చడం లేదు. దీంతో ఆయన కంటే ఆయన అభిమానులు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: