గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసాయి. కోటి ఆశలు పెట్టుకుని మరి బరిలోకి దిగిన రాజకీయ పార్టీలకు గ్రేటర్ ఓటర్ బిగ్ షాక్ ఇచ్చేశాడు. నేను రాను పోలింగ్ బూత్ కి అంటూ కచ్చితంగా చెప్పేశాడు. నా ఓటుతో అందలం ఎక్కి వరదలతో చస్తున్నా పట్టని నేతాశ్రీల కోసం నేనెందుకు క్యూ కట్టాలి అని మండిపోయాడు గ్రేటర్ ఓటర్.

సరే వచ్చిన వారు, మెచ్చి ఓటేసిన వారు చూసుకుంటే కనాకష్టంగా 35 శాతం ఓటింగ్ నమోదు అయిందని అంటున్నారు. అంటే గత మూడు ఎన్నికల బట్టి చూసుకుంటే ఈసారి  చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదు అయింది అని చెప్పాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే గ్రేటర్ లోనూ రాష్ట్రలోనూ అధికారంలో ఉన్న టీయారెస్ పార్టీ ఈ ఓటింగ్ సరళి పట్ల ఎలా రియాక్ట్ అవుతోంది అన్నది ఒక చర్చ. గులాబీ శిబిరం మాతం పోలింగ్ ఎక్కువగా జరగనందుకు కొంత షాక్ తిన్నప్పటికీ కూల్ గానే ఉన్నట్లుగా చెబుతున్నారు. వచ్చిన వారు వేసిన ఓటింగ్ బస్తీ జనాలే పోలింగ్ లో పాలు పంచుకోవడం ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయని ఆ పార్టీ  కచ్చితమైన అంచనా వేసుకుంటోందని తెలుస్తోంది.

మరో వైపు బీజేపీ అయితే ఓటింగ్ శాతం దారుణంగా పడిపోవడంతో చాలా పరేషాన్ అవుతోంది అన్నది టాక్. నిజానికి విపక్షానికి ఓటింగ్ శాతం పెరగాలి. అలా పెరిగితేనే హోప్స్ ఉంటాయి. తాము చేసిన భారీ ప్రచారానికి జనాలు స్పందించారు అని కూడా వారు సంత్రుప్తి చెందవచ్చు. కానీ చూస్తే సీన్ రివర్స్ అయింది. దంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ కానీ అధికార టీయారెస్ మీదనే విమర్శలు చేశారు. టీయారెస్ కావాలనే పోలింగ్ శాతాన్ని తగ్గించింది అని కూడా ఆరోపిస్తున్నారు. మరి దీని పరమార్ధం ఏంటి అన్నది నాలుగున జరిగే కౌంటింగ్ లో తెలిసిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: