గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది ఇపుడు ఉత్కంఠగా మారింది. కమలం బస్తీ మే సవాల్ అంటూ బరిలోకి దిగాక గ్రేటర్ ఎన్నికలు ఒక్కసారిగా మారిపోయాయి. దాని ప్రాధాన్యత కూడా ఢిల్లీ దాకా పాకింది. ఒక్క కార్పొరేషన్ అనుకోవద్దు దానికి ఎంతో విలువ ఉంది అన్నట్లుగా బీజేపీ తెగించి పోరాడింది. దాంతో గ్రేటర్ చుట్టూ హాట్ హాట్ రాజకీయమే సాగింది.

మరి ఓట్ల పండుగ పూర్తి అయింది. నచ్చిన వారు వచ్చి ఓపిగా పోలింగ్ బూత్ లో ఓట్లేశారు. నచ్చని వారు ఎవరు గెలిచినా ఓకే అనేశారు. ఇక మిగిలింది  ఓట్ల లెక్కింపు. ఆ తంతు  మొదలు కావడానికి ఇంకా మధ్యలో మరో రోజు ఉంది. దాంతో గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈసారి బీజేపీని నమ్ముకుని చాలా మంది బరిలోకి దూకారు.

మరి ఎవరు గెలుస్తారు అన్నది కనుక ఆలోచిస్తే పోలింగ్ సరళి బట్టి చూస్తే టీయారెస్ మరోసారి గ్రేటర్ లో పాగ  వేస్తుంది అని అంటున్నారు తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం అంటే అది కచ్చితంగా టీయారెస్ కి లాభమేనని అంచనాలు ఉన్నాయి. టీయారెస్ మీద కోపం కనుక ఉంటే ఓటర్ కదలి వచ్చి యాంటీగా ఓట్లు గుద్దేవాడని, అలా కాకుండా మెజారిటీ జనం దూరంగా ఉన్నారంటే వ్యతిరేకత మరీ ఎక్కువగా లేదని అంతా అంటున్నారు.

ఇదిలా ఉంటే టీయారెస్ లో కూడా అదే ధీమా కనిపిస్తోంది. ఏదోలా గెలిచి తీరుతామని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా 99 సీట్లు రాకపోయినా 80 దాకా వస్తాయని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇక బీజేపీకి పోలింగ్ గుబులు పుట్టించింది అంటున్నారు. తక్కువ పోలింగ్ తో గెలుపు అవకాశాలు తగ్గాయని అంటున్నారు. మొత్తం మీద గులాబీ పార్టీకి గుబులు తీరడంతో మంత్రి కేటీయార్ ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: