ఏపీ అసెంబ్లీ సమావేశాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు నువ్వా-నేనా అన్నట్లు మాటల యుద్ధం చేస్తున్నారు. అధికార పక్షం వైపు ఎక్కువ మంది నేతలు ఉండేసరికి, సభలో టీడీపీ తేలిపోతుంది. అదే సమయంలో టీడీపీ నుంచి అప్పుడప్పుడు వైసీపీకి ధీటుగా పోరాడుతుంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార వైసీపీని ఇబ్బంది పెడుతున్నారు.

ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో అడ్డంగా బుక్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్..తన పదునైన ప్రశ్నలతో వైసీపీని ఇబ్బందులు పెడుతున్నారు. సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ, తన వాక్చాతుర్యంతో ఆకట్టుకునే పయ్యావుల, 2019 ఎన్నికల్లో గెలిచాక చాలావరకు సైలెంట్ అయిపోయారు. ప్రతిపక్షం తరుపున బి‌ఏ‌సి ఛైర్మన్ అయినా సరే, అంతా యాక్టివ్‌గా వైసీపీ ప్రభుత్వం తప్పులని పట్టుకునే ప్రయత్నం చేయలేదు.

కానీ తాజాగా జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో కేశవ్...తన మాటలతో అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా కొత్త మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రజలపై కేవలం 10 శాతం భారమే పడుతుందని మాట్లాడారు. కానీ మంత్రి చెప్పినట్లుగా చట్టంలో మాత్రం ఆ పదమే వాడలేదని, అంటే ప్రజలపై ఎంత భారం మోపుతారో అర్ధమవుతుందని పయ్యావుల, బొత్సకు కౌంటర్ ఇచ్చారు. మాటల్లో చెప్పిన విధంగా చట్టంలో కూడా ఉండాలని, వైసీపీ ప్రభుత్వం మాటలు ఒకలా చెప్పి, చట్టం మరోలా చేస్తుందని మాట్లాడారు.

అలాగే వ్యవసాయంకు సంబంధించిన ప్రభుత్వం ప్రీమియం కట్టిందని అబద్దం చెప్పిందని పయ్యావుల నిరూపించే ప్రయత్నం చేశారు. ప్రీమియం కట్టారా లేదా అనే విషయాన్ని ఆర్‌టిఐ అసలైన సమాచారం తెప్పించుకుని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రం చేస్తున్న అప్పుల విషయంలో కూడా పయ్యావుల, ఆర్ధిక మంత్రి బుగ్గనకు చెక్ పెట్టడానికి చూశారు. ప్రభుత్వం అప్పుల తప్పా, అభివృద్ధి చేసే ప్రయత్నం చేయడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళేలా మాట్లాడారు. మొత్తానికైతే అసెంబ్లీలో పయ్యావుల అధికార వైసీపీకి తలనొప్పిగా మారి, చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటున్నారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: