2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్తితి ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ, ఒక్కసారిగా ఘోరంగా ఓడిపోయింది. దీంతో నేతలు వరుస పెట్టి అధికార పార్టీలోకి జంప్ కొట్టేశారు. అయితే తమ పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ రూల్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డైరక్ట్‌గా వైసీపీలో చేరకుండా, టీడీపీని వీడి నలుగురు ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టారు.

వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్‌కు వైసీపీ మద్ధదారులుగా మారారు. అయితే వీరి వెనుకే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటం ఖాయమని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇందులో గంటా శ్రీనివాసరావు అసలు పార్టీలో కనిపించడం లేదు. ఆయన ఎప్పుడో టీడీపీకి దూరం కావడంతో, పార్టీ మార్పు ఖాయమని పలురకాలుగా వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు గంటా పార్టీ మారకపోయినా సరే, టీడీపీ వాళ్ళు మాత్రం ఆయన్ని పట్టించుకోవడం మానేశారు.

ఇక గంటాని పక్కనపెడితే మొదట నుంచి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ వైపు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన వ్యాపారాలకు ఇబ్బందులు రావడంతో పార్టీ మార్పు ఖాయమని భావించారు. కానీ గొట్టిపాటి కూడా పార్టీ మారలేదు. కాకపోతే ఈయన ఎప్పటికైనా పార్టీ మారిపోతారని టీడీపీ శ్రేణులు డౌట్ పడుతున్నాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈయన, చంద్రబాబుకు పెద్దగా సపోర్ట్‌గా ఉంటున్నట్లు కనిపించడం లేదు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామిలు బాబుకు అండగా ఉంటున్నారు. కానీ గొట్టిపాటి యాక్టివ్‌గా ఉండటం లేదు. అటు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మీద కూడా టీడీపీ శ్రేణులు డౌట్‌గా ఉన్నాయి. ఈయన అసెంబ్లీలో మాట్లాడేప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కాస్త అనుకూలంగానే ఉన్నట్లు మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: