తెరాస రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇబ్బందుల్లో పడ్డారు.. అది తెలిసి చేసారా తెలియక చేసారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది .. మాములుగా ఏ వ్యక్తి అయినా తాను ఉన్న జిల్లా లోని ఒక మండల నియోజకవర్గానికి  ఓటర్ కార్డు ని ఇస్తారు.. వాళ్ళు ఆ ఓటర్  కార్డు ద్వారా అక్కడికి వెళ్లి ఓటు వేస్తారు .. కానీ కవిత మాత్రం హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేసింది . కవిత గారికి నిజామాబాదు జిల్లా పొతంగల్ ల ఓటు ఉంది ..కానీ కవిత ఆలా ఎందుకు ఓటు వేసింది దాని వెనకాల రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా ? ఈ చర్య పై ఎన్నికల కమిషన్ ఎలా రియాక్ట్ కానుంది ..ఈ విషయాలన్నీ ఈ ఆర్టికల్ లో చూద్దాం..

గ్రేటర్ ఎన్నికల్లో కవిత  ఓటు వేశారు.. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.. అయితే దీనినే ఆయుధంగా వాడుకుంటూ బిజెపి కవిత చేసిన పనిని  వేలెత్తి చూపుతుంది ..అయితే మొన్న జరిగిన నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు వేసిన కవిత మళ్లీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేయడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తుంది..
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బిజెపి రాష్ట్ర ఎన్నికల సంఘం కి ఒక లేఖ రాసింది

కవిత ఒక చోట ఓటుహక్కు ఉండగా మరో ప్రాంతంలో ఎలా ఓటు వేస్తారని బిజెపి ప్రశ్నిస్తుంది.. ఇలా వేరే చోట ఓటు వేసినందుకు కాను కవితని డిస్ క్వాలిఫై  చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.. అయితే ఎమ్మెల్సీ అయిన కవిత ఒక చోట ఓట్లు ఉండగా హైదరాబాద్ లో లో ఓటు ఎలా వేస్తారు అంటూ పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి..

అయితే ఇందులో భాగంగా   కవిత ఇలా ఓటు వేయడాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తీవ్రంగా ఖండించారు..ఎమ్మెల్సీ కవితకి  నిజామాబాద్ జిల్లా పోతంగల్ లో ఓటుహక్కు ఉండగా ఇప్పుడు బంజారాహిల్స్లో ఓటు వేయడం ఏంటని కవితని ప్రశ్నించింది .. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె అయి ఉంది  ఇలా రెండు చోట్ల ఓటు వేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది..కవిత చేసిన దానిపై  ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని ఇందిరా శోభన్ తెలిపింది ..అయితే ఇప్పటివరకు కవిత విషయం పై ఇంకా స్పందించిన తెలంగాణ ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి ..



మరింత సమాచారం తెలుసుకోండి: