ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల హడావిడి  తగ్గిందో లేదో మరో ఎన్నికకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో…అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక గ్రేటర్ హడావుడి  తగ్గడంతో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి నాగార్జుసాగర్‌పై పడింది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ తరపున ఎవరు పోటీ చేస్తారనేదానిపై అప్పుడే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. నోముల నర్సింహయ్య, జానారెడ్డి వారసులు…ఏ పార్టీల నుంచి బరిలోకి దిగుతారనేదది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణాలో 2018వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత  జరగబోయే మూడో ఉప ఎన్నిక ఇది. ఇప్పటికే హుజూర్ నగర్, దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలవడంతో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ గత ఏడాది ఉప ఎన్నిక నిర్వహించారు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినా టీఆర్ఎస్ గెలుపొందింది. ఇక దుబ్బాక ఉప ఎన్నిక ఎంత హాట్ హాట్ గా సాగిందో అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంల బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నాగార్జున సాగర్‌పై పడింది.

ఈ స్థానం పై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. గత ఎన్నికల్లోనే నాగార్జున సాగర్‌ నుంచి పోటీకి ఆసక్తి చూపారు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి. ఇక ఈ ఉప ఎన్నికలో పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో జానారెడ్డిని తమ పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు కమలనాథులు. అంతేకాదు రఘువీర్‌ రెడ్డి తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.మరోవైపు జానారెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇటు టీఆర్‌ఎస్ కూడా నాగార్జున సాగర్‌లో బలమైన అభ్యర్థిని దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో పొలిటికల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: