గ్రేటర్ ఎన్నికలు ఈ సారి ఎప్పుడు లేనంతగా ఆసక్తిని రేకెత్తిచాయి.అయితే అనూహ్యంగా పోలింగ్ రోజు ఓటింగ్ చాలా తక్కువ నమోధైంది. .అయితే ఉదయం నుండి మందకొడిగా సాగిన పోలింగ్ శాతం ఓటింగ్ అయిపోయే టైమ్ లో అనూహ్యంగా 10 శాతం ఓటింగ్ పెరిగింది.దీంతో ఆఖరి గంట సమయంలో ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.ఎందుకంటే ఒక్క గంటలోనే పోలింగ్ శాతం రెడ్ మార్కును దాటడంతో అందరూ కూడా ఏం జరిగిందన్న ఆలోచనలో పడ్డారు.

ఇదిలా వుంటే మద్యాహ్నం 2 గంటల వరకు ఓటర్లు లేక కునుకు పాట్లు తీసిన సిబ్బందికి దాదాపుగా ఓటింగ్ సమయం ముగిసేటప్పుడు అనూహ్యంగా పెరిగింది.ఉదయం నుండి రాని ఓటర్లు ఓటింగ్ టైమ్ అయిపోయేటప్పుడు రావడం గమనార్హం. ఇదంతా ఒకవైపు ఉంటే సాయంత్రం ఆఖరి గంట మాత్రం దాదాపు సగం రోజు ఓట్లను రాబట్టినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 35.80 శాతం.దీంతో పోలింగ్ ముగిసినట్లుగానే భావించారంతా. కానీ ఆఖరి గంట పోలింగ్ శాతాన్ని మాత్రం అర్థరాత్రి 12 గంటల తర్వాత ప్రకటించింది ఎన్నికల సంఘం. మొత్తం పోలింగ్ 45.70 శాతంగా నమోదైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ 45.29 శాతం మాత్రమే. కానీ ఈసారి 0.50 శాతం ఎక్కువగా జరిగింది. ఈ లెక్కన సాయంత్రం ఆఖరి గంటలో జరిగిన పోలింగ్ శాతం 10 శాతం ఓటింగ్ నమోదైంది.దీంతో అవి రిగ్గింగ్ ఒట్లా లేక ప్రజలు వేసిన ఒట్లా అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: