ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. వివిధ ప్రయోజనాలే ముఖ్యంగా నాయకులు పార్టీ మారిపోతూ, తమ రాజకీయ జీవితానికి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు వెనుకాడడం లేదు. అదే విధంగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం టిడిపిని వీడి వైసీపీలో చేరాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఆయన పార్టీ మారే అవకాశం లేకుండా చేస్తోంది . దీనికి పరిస్థితులు కూడా అనుకూలించడం లేదు. ఒక దశలో వైసిపిలో చేరేందుకు గంటలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, విజయసాయిరెడ్డి అడ్డుకోవడంతో అది కాస్త వాయిదా పడింది. ఇక అప్పటి నుంచి ఎప్పటికప్పుడు పార్టీ మారేందుకు రకరకాలుగా గం టా ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. అయితే ఆయనకు సరిగా కలిసి రావడం లేదు. ఇటీవలే ఆయన ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.




 ఇదిలా ఉంటే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల సమావేశాలకు గంటా హజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన పుట్టినరోజును చాలా సాధారణంగా చేసుకున్నారు తప్ప , ఎక్కడా హడావుడి చేయలేదు. కనీసం గంటా కటౌట్లు కూడా కనిపించలేదు. అక్కడక్కడా కొంతమంది మాత్రమే హడావుడి చేస్తున్నట్టు కనిపించారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు పైన గంటా స్పందించలేదు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రావాలని ఆకాంక్షిస్తూ కామెంట్ చేశారు. ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఏదో చేయాలని తపన పడుతున్నారని జగన్ ను పొగుడుతూనే , టిడిపి అధినేత చంద్రబాబు ను గంటా పొగడారు.



 ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అంటూ.... ఈ ఇద్దరు నాయకులు కలిసి ప్రజా సమస్యలపై చర్చించాలని వేదాంత ధోరణిలో మాట్లాడారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే, ఈ రెండు పార్టీలలో ఎవరిని విమర్శించడం వంటి వాటి జోలికి వెళ్లకుండా , పొగుడుతూ రెండు పార్టీల అనుగ్రహం కావాలి అన్నట్లు గా వ్యవహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: