జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రాజుకున్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలే పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఎన్నికలకు సంబంధించిన వేడి ఇంకా గ్రేటర్ పరిధిలో తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రచార రంగంలో దూసుకుపోయాయి అని చెప్పాలి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించారు.



 ఇక ప్రచారం ముగిసిన వెంటనే డిసెంబర్ ఒకటవ తేదీన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించినప్పటికీ గ్రేటర్ పరిధిలోని ఓటర్లు మాత్రం అంతగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు దీంతో పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు లేక వెలవెలబోయాయి దీంతో అతి తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ముమ్మర ప్రచారం నిర్వహించి అభ్యర్థులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.


 అయితే ఇక డిసెంబర్ 4వ తేదీన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ ఒక్క రోజు గడిస్తే చాలు రేపు ఫలితాలు వెలువడనున్న  నేపథ్యంలో రేపటి ఫలితాల కోసం ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా బిజెపి విజయం సాధించినది.  జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా విజయం సాధిస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఈ క్రమంలోనే ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం చూపు మొత్తం ఆకర్షిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: