వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినదగ్గరినుంచి సమర్ధవంతమైన పాలనా అందిస్తూ ముందుకు వెళ్తుంది. అంతేకాదు సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. జగన్ అధికారంలో వచ్చిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం అమరావతి ని కాదని  విశాఖ ను రాజధాని గా చేయడం.. ఈ విషయం పై జగన్ కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే వాటిని అయన పట్టించుకోలేదు. తన దూకుడు స్వభావం తో నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఫలితంగా రాజధాని ఏర్పాటు జరుగుతుంది..

అయితే గిట్టని కొన్ని ప్రతిపక్షాలు ఈ కేసును కోర్టు కి తీసుకెళ్లారు.. ప్రస్తుతం దీని తీర్పు పెండింగ్ లో ఉంది.. త్వరలోనే తీర్పు రానుంది.. ఇక గత కొన్ని రోజులుగా పార్టీ లో లో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నాయని వార్తలు బయటకి వస్తున్నాయి.. జగన్ ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదని విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో జగన్ వీటిని ఎలా సరిదిద్దుతాడో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు ఇటీవలే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అయన పామర్రు కి చేరుకున్నాడు..

అక్కడ జరిగిన ఓ ఆసక్తి కర విషయం వైసీపీ లో అసంతృప్తి ఉందనడానికి నిదర్శనంగా నిలిచింది. పామర్రు వద్ద పవన్ కల్యాణ్‌ను మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య యాదవ్ కలిశారు. ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను.. తుపాన్ పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అంచనాలతో సరిపెట్టి ఆదుకోని వైనం.. ఇలా మొత్తం పవన్ కల్యాణ్‌కు వివరించారు. అయితే ఈ విఖ్యాలు చేసిన రెడ్డయ్య ఎవరో కాదు.. వైసీపీ ఎమ్మెల్యే… మాజీ మంత్రి పార్థసారధి తండ్రి.కుమారుడు ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోరు. కానీ పవన్ తో అయన చెప్పిన విధానం చూస్తుంటే కుమారుడి రాజకీయ భవిష్యత్ పై అయన వైసీపీ పట్ల అసంతృప్తి గా ఉన్నట్లే అనిపిస్తుంది.. అయితే ఇదంతా పార్థ సారధి కి తెలియకుండా అయితే జరగదుకదా..

మరింత సమాచారం తెలుసుకోండి: