ఒకప్పుడు ఏదైనా తినాలి అనిపించిందంటే చాలు వంటింట్లోకి హాయిగా వండుకొని తినే వారు కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా తినాలనిపించింది అంటే చాలు ముందుగా ఫోన్ పట్టుకొని ఆన్లైన్ లో ఫుడ్  ఆర్డర్ చేస్తూ క్షణాల్లో డోర్ డెలివరీ పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇలా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు ఎన్నో తెర మీదికి వచ్చిన నేపథ్యంలో ఎక్కువగా వంటింట్లో పాట్లు  పడేకంటే ఎంతో మంది ప్రజలు ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఎలాంటి కష్టం లేకుండా వంటింట్లోకి వెళ్ళకుండానే  హాయిగా ఆన్లైన్లో ఫుడ్ డోర్ డెలివరీ అవుతుండడంతో దీనికే ఎక్కువగా అలవాటు పడిపోయారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కాస్త కొన్ని కొన్ని సార్లు సమస్యలు తెచ్చిపెడుతుంది ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది లో స్లో  ఇంటర్నెట్ కారణంగా బాలికకు ఊహించని షాక్ తగిలింది. తనకోసం బామ్మ కోసం రెండు ఆర్డర్లు  ప్లేస్ చేసింది బాలిక. అయితే ఇంటర్నెట్ స్లో గా ఉండడంతో తరచూ ఆర్డర్ కన్ఫార్మ్ బటన్ నొక్కింది. కొద్దిసేపటి తర్వాత నే కాలింగ్ బెల్ మోగింది. ఇక ఆర్డర్  వచ్చి ఉంటుంది అని ఎంతో ఆతృతగా వెళ్లి డోర్ తెరిచి ఒక్కసారిగా షాక్ అయింది. ఏకంగా 30 మంది డెలివెరి  బాయ్స్ ఆమె కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు.



 42 మంది ఫుడ్ ఆర్డర్లను తెచ్చి ఆమె ముందు ఉంచారు డెలివరీ బాయ్స్ . ఇక ఆ తర్వాత ఏమీ అర్థం కాక ఫోన్ లో తాను ఆ ఆర్డర్ చేసిన లిస్ట్  చూసి షాక్ అయింది బాలిక. స్లో  ఇంటర్నెట్ కారణంగా పదేపదే ఆర్డర్ కన్ఫార్మ్ కొట్టడంతో 42 ఆర్డర్లు ఉంచినట్లు అక్కడ చూపించింది. ఈ క్రమంలోనే 42ఆర్డర్లను ఏం చేయాలో ఆ బాలికకు అర్థం కాలేదు ఈ క్రమంలోనే ముందుకు వచ్చిన స్థానికులు 42 ఆర్డర్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. కాగా చివరికి ఆ బాలిక ఊపిరిపీల్చుకుంది. ఇలా స్లో ఇంటర్నెట్ కారణంగా బాలిక ఫుడ్ డెలివరీ యాప్ తో ఇబ్బందులు పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: