మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిన కొన్ని కొన్ని సార్లు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో మృత్యువు కబళించి ఊహించని విధంగా ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది దీంతో చివరికి కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా పదహారు వందల డబ్భై కిలోమీటర్ల దూరాన్ని ఎంతో సురక్షితంగా చేరుకున్న వ్యక్తి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో గమ్యస్థానానికి చేరుకునేలోపే మృత్యువు అతని కబలించింది.  విద్యుదాఘాతం రూపంలో అతని ప్రాణం తీసింది. 44వ జాతీయ రహదారిపై ఈ విషాదకర ఘటన జరిగింది.



 వాహనదారులు చిన్న పాటి నిర్లక్ష్యం  ఎంతో విలువైన ప్రాణాలు బలితీసుకుంది. సాధారణంగా వాహనం నడిపేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి అన్న విషయం తెలిసిందే ఈ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏకంగా భారీ మూల్యం చెల్లించక తప్పదు అని పోలీసులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఇక ఇటీవల జరిగిన ఘటన వాహనదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి అనేదాని నిరూపిస్తోంది. ఒక కంటైనర్ డ్రైవర్ కంటైనర్ ఎంతో సురక్షితంగా 1670 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చాడు... ఇంకా గమ్య స్థానానికి చేరుకోవడానికి వెళ్లాల్సిన దూరం 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇంతలో ఏకంగా మృత్యువు అతని కబళించింది... కంటైనర్ డ్రైవర్ పంచర్ అయిన టైర్ మార్చేందుకు వాహనాన్ని విద్యుత్ తీగల కింద నిలిపివేశాడు.



 అయితే అక్కడ విద్యుత్ తీగలు ఉన్నాయి అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేదు.  ఒక్కసారి కూడా పైన తల లేపి చూడలేదు. ఈ క్రమంలోనే జాకీ తో ఒక్కసారిగా కంటైనర్ను లేవడంతో పైన ఉన్న విద్యుత్ తీగలు కంటైనర్ కు తాకి  విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు ఇక్కడ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. అయితే మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావా  జిల్లాకు చెందిన దిలీప్ కుమార్ శర్మ గా గుర్తించారు పోలీసులు. 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కాళ్ల కాల్ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: