తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ ముందే ఇచ్చేశారు.. రాజకీయ పార్టీపై ట్విట్టర్ వేదికంగా తలైవా క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ట్వీట్ చేశారు. జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.. డిసెంబర్ 31న పార్టీ వివరాలు ప్రకటిస్తామన్నారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. 



ఈ విషయం పై తమిళనాడులో తన అభిమాన సంఘాలతో చర్చలు జరిపారు. అక్కడ మాట్లాడిన విషయాలను బయట పెట్టని రజినీ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.. రాజకీయ ప్రవేశంపై వీలైనంత తర్వగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. మక్కళ మండ్రం సభ్యులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు.  అలాగే ఆ పార్టీలోని లోటు పాట్లు గురించి రజినీ పార్టీ సభ్యులతో చర్చలు జరిపారు.. రజినీ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అనేది మాత్రం ఆలోచనలో పడేసింది.. చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్న ఈ చర్చలకు రజినీ ఎందుకు ఇప్పుడు ఇలాంటి ఆలోచన చేశారో దోహద పడలేదు..ఒకవైపు డాక్టర్లు అతని ఆరోగ్యం సరిగా లేదని చెప్తున్నా ఇలా అనుకోవడం వెనుక రహస్యాలు తెలియరాలేదు..




ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. ఇప్పుడు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు... అయితే ఒక వైపు జయలలిత రైట్ హ్యాండ్ గా ఉన్న శశికళ ను కూడా భారీ మొత్తంలో జరిమానాను కట్టి విడిపించడానికి సర్వం సిద్దం చేసారు.. ఇకపోతే రజినీ ఎంట్రీ ఇస్తుండటంతో తమినాడు రాజకీయాలు ఆసక్తి గా మారాయి.. మరి వీరిద్దరూ ఒకే పార్టీలో ఉంటారా లేదా అనేది ఆలోచనలో పడేసింది.. బీజేపి పార్టీలో రజినీ ఉంటే అతనికి మద్దతు అభిమానులు మద్దతు ఉండదని తెలుస్తుంది... మొత్తానికి రజినీ రాజకీయ ప్రవేశం అయితే కన్ఫర్మ్ అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: