మనుషుల్లో టీనేజ్ వయసు చాలా ముఖ్యమైనది .. ఆ వయసు లో వచ్చే మానసిక  మరియు శారీరక మార్పులు సంభవిస్తాయి .. ఆకర్షణ మరియు ప్రేమ ఈ రెండు టీనేజ్ వాళ్ళని తికమక పెడతాయి .. చాలా మంది ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు ..

అయితే టీనేజ్ వయసులో అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ కలగడం సహజం .. తరుచు స్కూల్ ప్రేమలు మరియు కాలేజీ ప్రేమలు టీనేజ్ లో నడుస్తూ ఉంటాయి .. అయితే ఈ ప్రేమలలో   చివరి ఘట్టం వరకు చేరేవి మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టేలా ఉంటాయి ..దాదాపుగా అయితే టీనేజ్ ప్రేమలు పెళ్లి వరకైతే వెళ్లవు అది మాత్రం పక్క .. మరియు కొన్ని కాలేజీ లవ్ స్టోరీ లు మ్యారేజ్ వరకు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటాయి..  కొందరు యువకులు వాళ్ళ ప్రేమ విషయాన్నీ  పెద్దలను ఒప్పించి ఒకటవుతారు..  మరికొందరేమో  తెలిసి తెలియని  వయసులో తొందరపడి నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు..  తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది...

అయితే ఒక  విద్యార్థి,  విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు.. ఈ పెళ్లికి మరో విద్యార్థి పెద్దగా ఉంది దగ్గరుండి మరి వీరి పెళ్లి చేయించాడు.... తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదని నవంబర్ నెలలో వారికి పెళ్లి కాగా  తాజాగా విషయం ఇప్పుడు  బయటకు వచ్చింది... జరిగిన  పెళ్లి విషయం ప్రిన్సిపల్ దాకా చేరడంతో అతడు వాళ్ళిద్దరి టిసి ఇచ్చి కళాశాల నుండి పంపించారు.. అంతే కాదు  ఇరువురి పెళ్లికి సహకరించిన విద్యార్థినిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.... మరోవైపు విద్యార్థులు ఇలా పెళ్లి చేసుకోవడంతో వాళ్ల తల్లిదండ్రులు షాక్ అయ్యారు..  ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితులో  ఉన్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: