తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా నేపథ్యంలో నేవీ డే రద్దు చేసామని ఆయన చెప్పారు. విశాఖ తీరంలో  విద్యుత్ కాంతులతో  షిప్ లను ఏర్పాటు చేస్తాం అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధానంగా మేలు చేకూరేది త్రివిధ దళాలలకే అని ఆయన స్పష్టం చేసారు. పబ్లిక్ , ప్రైవేట్ , ఎమ్.ఎస్.ఎమ్ ఈ రక్షణ రంగ అవసరాలకు పనిచేయాల్సిన అవసరం వుంది అని అభిప్రాయపడ్డారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చకుని పురోగమించడానికి ఇదే సరైన తరుణం అన్నారు.

5 ట్రిలియన్ ఎకనమీ సాధనలో సముద్ర రవాణా కీలకం అని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా  రక్షణ పర్యవేక్షక వ్యవస్ధను మరింత బలోపేతం చేసుకవాలి అని సూచించారు. ఎదురయ్య సవాళ్లకు ధీటుగా ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, లాంగ్ రేంజ్ షిప్ లు, న్యూక్లియర్ సబ్ మెరైన్ల ను సమకూర్చుకోవాలన్నారు. మేరీటైమ్ డొమైన్ ఎవేర్ నెస్ పై ప్రధానంగా దృష్టి పెట్టాము అని వెల్లడించారు. నిర్మాణంలో వున్న విక్రాంత్ ఎయర్ క్రాఫ్ట్ కెరియర్ కోవిడ్ కారణంగా ఆలస్యమవుతోంది అని ఆయన తెలిపారు.

2021 లో విక్రాంత్ కు ట్రైల్ రన్ పూర్తయ్యే అవకాశాలున్నాయి అని అన్నారు. 2022 కల్లా తూర్పునావికదాళంలోకి చేరవచ్చు అని వెల్లడించారు. విశాఖ సముద్రజలాల్లో 2022 లో ప్రెసిడెంట్స్ మిలన్ ఉంటుంది అన్నారు. మిలన్ కు రాష్ట్రపతి హాజరవుతారు అని వెల్లడించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఖరారు కాగేనే తేదీలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. హానీట్రాప్ లో ఎంతటివారున్నా ఉపేక్షించేదిలేదు అని, పాకిస్ధాన్ నుంచి సోషల్ మీడియా డమ్మీ ఫేస్ బుక్ ఎకౌంట్ల తో హనీట్రాప్ కు పాల్పడుతోంది అని అన్నారు. ఆన్ బోర్డ్ షిప్ లలో మోబైల్ ఫోన్లు నిషేధించామని అన్నారు. హానీట్రాప్ కు గురైన వారిలో యువసైలర్లే వున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: