నేటి సమాజంలో దాడులు, దారుణాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ గొడవల్లో పడి చాలా మంది అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు కొందరు దుండగులు. తమ కుటుంబంలోని వ్యక్తులైనా సరే వెనకకే తగ్గేదే లేదంటూ కయ్యాని కాలుదువ్వుతూ ప్రాణాలు తీస్తున్నారు.  ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా గాని కయ్యానికి కాలు దువ్వే వారిని మాత్రం మార్చలేకపోతున్నాయి చట్టాలు. విషయం ఏదైనా సరే తప్పు వారిదున్నా వారిని ఎదిరిస్తే మాత్రం ఇక అంతే సంగతులు. మమ్మల్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ ఏ అర్థరాత్రో వచ్చి దాడి చేస్తారు.

ఇలాంటి ఘటనే తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెబ్రోలు గ్రామంలో ఈ అమానుష ఘటన వెలుగులోకొచ్చింది. అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి రంగు పూసుకుని ఓ తండ్రీకూతుళ్లపై దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి సీతారామయ్య తన కూతురు. సీతారామయ్య శకంఖవరం మండలం నెల్లిపూడి అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవాడు. అయితే ఇతని ఇంటికి  అర్థరాత్రి ఒకరో వచ్చి తలుపుతట్టడంతో.. తలుపు తీసాడు సీతారామయ్య. ఆ సమయంలోనే ముఖానికి రంగు పూసుకుని ఉన్న గుర్తుతెలియని వ్యక్తి అతనిపై దాడికి ఎగబడ్డారు. 

దాంతో అక్కడే ఉన్న సీతారామయ్య కూతురు తన తండ్రిపై దాడిని ఆపే ప్రయత్నం చేసింది. దాంతో ఆ దుండగుడు ఆ ఉపాధ్యాయుని కుమార్తె దనశ్రీపై కూడా దాడి చేశాడు. దాంతో సీతారామయ్య భార్య బయపడి గట్టిగా కేకలు వేయడంతో దాడికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ దాడిలో తీవ్రగాయాలపాలైన తండ్రీకూరిళ్లను పుఠాపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ దాడిపై పోలీసులకు బాదితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ దాడికి వారి భూమి విషయంలో వచ్చిన తగాదాలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: