ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తనదైన శైలిలో అసెంబ్లీలో చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొడాలి నాని కూడా సభలో మాట్లాడి, మరింత హీట్ పెంచారు. ఎప్పటిలాగానే బాబుని ఒక ఆట ఆడుకున్నారు. టీడీపీ, చంద్రబాబులు జగన్ మీద చేసే నెగిటివ్ ప్రచారాలని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు, జగన్ మీద విమర్శలు చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు.

అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో జరిగే తప్పులని ఎత్తిచూపిస్తారు. అయితే కొడాలి నాని కాస్త విరుద్ధంగా వెళ్తారు. గతంలో చంద్రబాబు చేసే తప్పిదాలని చెబుతూనే, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని కూడా తీసుకొస్తారు. అసలు ఈ అంశం ఎక్కువసార్లు పట్టుకుని బాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు, జగన్‌ని ఉద్దేశించి ఫేక్ సీఎం అంటూ మాట్లాడిన సందర్భంపై కౌంటర్ ఇస్తూ... 1983లో  ఓడిపోయినప్పుడు కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు పారిపోయారని, అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారని మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ వదిలి పారిపోయారని, కరోనా రాగానే కాల్వ గట్టు వదిలి పారిపోయారని, చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నాయకుడని, టీడీపీ ఫేక్ పార్టీ అని, బాబే గాలి నాయకుడని, పారిపోయేవాళ్లెవరో ప్రజలందరికీ తెలుసని కొడాలి నాని ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు.

అయితే ఈ విధంగా కొడాలి మాట్లాడినట్లు వేరే వైసీపీ నేతలు మాట్లాడటం అరుదు. కొడాలి మాత్రం ప్రతి అంశంలో బాబు గతాన్ని కూడా తీసుకొచ్చి ఓ ఆట ఆడేసుకుంటారు. లేదంటే చంద్రబాబు ప్రతిసారి జగన్ మీద ఏదొరకమైన విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ విమర్శలని తిప్పికొట్టాలంటే ఈ రేంజ్‌లోనే మాట్లాడాలని వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఏదేమైనా కొడాలి మాత్రం బాబుకు చుక్కలు చూపించడంలో ముందున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: