ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. టెస్ట్‌ సిరీస్‌కు దూరమవుతున్నాడు. భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌గా ఉండటంతో.. పెటర్నల్‌ లీవ్‌ పెట్టి ఇండియా వెళ్తున్నాడు. కోహ్లీ పెట్టిన లీవ్‌కి బీసీసీఐ కూడా ఆమోదం తెలిపింది. అయితే.. కోహ్లీ లీవ్‌ పై మండిపడుతున్నారు టీం ఇండియా ఫ్యాన్స్‌. దేశం కంటే భార్యే ముఖ్యమా అని కొందరు.. ధోనీని చూసి కోహ్లీ నేర్చుకోవాలని కొందరు.. అనుష్క కడుపుతో ఉంటే కోహ్లీ ఏం చేస్తాడని మరికొందరు.. సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

ఈ కామెంట్లపై కోహ్లీ కూడా ఘాటుగానే స్పందించాడు. తన భార్య అనుష్కశర్మ మొదటి బిడ్డకు జన్మనిస్తోందని.. అది తనకెంతో ముఖ్యమని.. ఆ క్షణాల్లో అనుష్క దగ్గర తాను లేకపోతే ఎలా అని కోహ్లీ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా టూర్‌ కి ఎంపికవడానికి ముందే లీవ్‌ పెట్టానని చెప్పాడు. .

విరాట్‌ పెట్టిన పెటర్నల్‌ లీవ్‌ .. ఇప్పుడు.. ఇండియా వైడ్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. పెటర్నల్‌ లీవ్‌ కూడా ఉంటే బాగుటుందనీ.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ కంపెనీలు ఈ విషయమై ఆలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు మెటర్నిటీ లీవ్‌ మాత్రమే అందరికీ తెలుసు. విదేశాలకే పరిమితమైన పెటర్నల్‌ లీవ్‌... ఇండియాలో వర్కవుట్‌ అవుతుందా..? అసలు పెటర్నల్‌ లీవ్‌ ఎంత ఇంపార్టెంట్‌ అన్న చర్చకు దారి తీసింది.

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతీ గర్భిణిలో బీపీ ఫ్లక్చ్యువేషన్స్‌ ఉంటాయని.. అలాంటి సమయంలో భర్త ఇచ్చే ధైర్యం చాలా ముఖ్యమనీ డాక్టర్లంటున్నారు. దీనివల్ల కూడా బీపీ కంట్రోల్‌ లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. డెలివరీ కూడా నార్మల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

డెలివరీ సమయంలోనే కాదు.. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్‌ అయిన మొదటి రోజునుంచే భర్త తోడు తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అయితే, కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని టీం ఇండియా అభిమానులు వ్యతిరేకిస్తున్నా.. వీవీఎస్‌ లక్ష్మణ్‌, టీం ఇండియా కోచ్‌ రవిశాస్త్రి లాంటి వారు మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచించి.. మెటర్నిటీ లీవ్‌ మాదిరిగానే పెటర్నల్‌ లీవ్స్‌ కూడా ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: