ప్రతిపక్ష టీడీపీ బలమైన అధికార వైసీపీని ఎదురుకునేందుకు అనేక వ్యూహాలతో ముందుకెళుతుంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన్ని టార్గెట్ చేస్తూ, విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తమదైన శైలిలో జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకుని ముందుకెళుతున్నారు.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం అదే అజెండాతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఏదైనా విషయం గురించి మాట్లాడుతుంటే, దానికి అడ్డుపడే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రతి విషయంపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు. మళ్ళీ బయటకొచ్చి మీడియా ముందు కూడా జగన్‌పైనే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ని మరింత ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంగా టీడీపీ ప్రజా శాసనసభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.


జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికే టీడీపీ నేతలు ఇలా ప్రజా అసెంబ్లీ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలో అధికార పక్షానికి ధీటుగా నిలబడలేక, ఇలా బయటకొచ్చి, విమర్శలు చేయనున్నారని చెబుతున్నారు. పైగా జగన్, కన్నబాబులపై సభా హక్కుల నోటీసులు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమవుతుంది. పంటల బీమా పథకంపై సభను తప్పుదోవ పట్టించారని నోటీసుల్లో పేర్కొంటూ..స్పీకర్ కార్యాలయంలో ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే తాజాగా పంటల బీమా విషయంలో ప్రభుత్వం రాంగ్ స్టెప్ వేసిందని టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మొదట బీమా కట్టేశారా? అని అడిగితే మంత్రి కన్నబాబు కట్టేశామని అబద్దం చెప్పారని, కానీ సమాచార హక్కు చట్టం కింద అసలైన సమాచారం తెప్పించుకున్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, బీమా కట్టలేదనే విషయాన్ని చెప్పారు. దీంతో అప్పటికప్పుడు ప్రభుత్వం బీమా చెల్లించడం టీడీపీకి అవకాశం దొరికినట్లైంది. దీన్ని అడ్డం పెట్టుకునే టీడీపీ ఇప్పుడు జగన్, కన్నబాబులని టార్గెట్ చేసుకుని ముందుకెళుతుందని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: