టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం  ప్రతిరోజూ ఒక అత్యాచారం, వారానికో హత్యగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పశువులను కోసినట్లుగా ఆడపిల్లలను చంపేస్తున్నారు అని మండిపడ్డారు.  వైజాగ్ లో ఒక ఉన్మాది ఆడపిల్ల గొంతు కోస్తే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఇంకో ఉన్మాది మరో ఆడపిల్ల గొంతు కోశాడు అన్నారు. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయింది అని విమర్శలు చెప్పారు.

రాష్ట్రానికి హోం మంత్రిగా మహిళను నియమించానని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి... జరుగుతున్న అమానుషాలను చూసి సిగ్గపడాలి అన్నారు. ఆడపిల్లలకు మేనమామమని చెప్పిన జగన్ దిశా యాక్ట్ ప్రవేశపెట్టాక అఘాయిత్యాలు పెరిగాయి అన్నారు. అయినా సిగ్గులేకుండా దిశా యాక్ట్ కు మూడు అవార్డులు వచ్చాయని చెప్పుకుంటున్నారు అని ఆమె విమర్శించారు.  ఇంకా చట్టబద్దత కానీ దిశా యాక్ట్ కు అవార్డులు ఎలా వస్తున్నాయి అని నిలదీశారు. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరగగలిగితే స్వాతంత్ర్యం అన్నారు ఆమె.

 ఏపిలో ఆడపిల్లకు బయట కాదుకదా..ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది అన్నారు.  తెలుగుదేశం పార్టీని విమర్శించేందుకు మాత్రమే మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఒకసారి మెరుపు తీగలా వస్తున్నారు అని ఆమె విమర్శించారు. అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందో, తేదో తెలియని పరిస్థితి  ఉందని అన్నారు.  ఇప్పటికైనా హోం మినిస్టర్ కళ్లు తెరిచి మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలి అని డిమాండ్ చేసారు. బోండా ఉమ మాట్లాడుతూ 18 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైసిపి సర్కారు శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందింది అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ఆడపిల్లలపై దాడులు పెరిగాయి అన్నారు. చంద్రబాబు హయాంలో రౌడీలు రాష్ట్రంలో ఉండటానికే భయపడేవారు అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: