చంద్రబాబు మర్యాద గురించి మాట్లాడడం చూస్తూనే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది.. ఎందుకంటే అసెంబ్లీ సభలో తనకు మర్యాద కావాలని కోరుకునే బాబుగారి కి తన గత ప్రవర్తనలు ఎందుకు గుర్తుకు రావడం లేదో కానీ మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకునే విషయం అనే విషయం కూడా తెలియనట్లుంది. జగన్ అధికారంలో కి రాకముందు ఆయనను చంద్రబాబు ఎలాంటి మాటలన్నారో అందరి విన్నారు.. అయితే అవే మాటలు ఇప్పుడు తనకు రివర్స్ వస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు..

ఓడిపోయినా తర్వాత కూడా జగన్ విమర్శించే స్థాయిలో చంద్రబాబు ఏమాత్రం తగ్గట్లేదు.గతం కంటే కొన్ని మాటలు ఎక్కువ అంటున్నారు కానీ విమర్శల మాటలు తగ్గించడం లేదు. అసెంబ్లీ లో సైతం చంద్రబాబు జగన్ ని సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు.. అందుకే , ఆ నోరి దూలవల్లే టీడీపీ సభ్యలు కొందరు వరుసగా మూడు రోజులు బహిష్కరించబడ్డారు. అయితే టీడీపీ నేతలు ఇంతలా విమర్శిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం ఊరికే కూర్చోలేదు.. ఇది టీడీపీ ఆఫీస్ అనుకున్నారా చంద్రబాబు గారూ. మీ కీర్తనలు వినిపించడానికి అంటూ వైసీపీ మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. బాబు విషయంలో వారు సెటైర్లు వేస్తున్నారు. ఎకసెక్కం ఆడుతున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబుకు మండిపోతోంది. నాకు మర్యాద లేదా అంటూ ఆయనకు ఆయనే కోరి మరీ అడిగేస్తున్నారు.

టీడీపీలో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు లేరు. మాట్లాడితే అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌద‌రి, రామానాయుడు తప్ప మరో ఎమ్మెల్యే లేరు. ఇక చంద్రబాబు నోరు చేసుకోవాల్సివస్తోంది. బాబు కి మైక్ ఇవ్వగానే వైసీపీని విమర్శిస్తూనే ప్రసంగాలు చేస్తున్నారు. దాంతో వారికి మండుకొస్తోంది. అటునుంచి గట్టిగానే డైలాగులు పడిపోతున్నాయి. మొత్తానికి సభలో చంద్రబాబుకు మర్యాద దక్కడంలేదు. అయినా మర్యాద అంటే ఇచ్చి పుచ్చుకోవాల్సిందే కదా. సీనియర్ నేతగా బాబు కూడా సభను గౌరవించాలి కదా అని వైసీపీ నుంచి వస్తున్న వాదన. ఏది ఏమైనా మర్యాద కావాలంటున్నారు చంద్రబాబు. అదేదే ఇచ్చేస్తే పోలా సభ సాఫీగా జరుగుతుందేమో అని వైసీపీకి కూడా రాజకీయ సూచనలు అందుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: