ఇటీవలే జరిగిన దుబ్బాక ఎన్నిక ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అందరికి తెలిసిందే.. తెరాస పార్టీ కి వన్ సైడ్ అవుతుందనుకున్నారు అంతా కానీ బీజేపీ ఎంట్రీ తో ఈ రెండు పార్టీ లమధ్య పోరు ఎంతో ఆసక్తి కరంగా మారిపోయింది. బీజేపీ గెలుపుతో తెరాస వాయిస్ అక్కడ మూయగబోయింది.. ఇక గ్రేటర్ ప్రచరంలోనూ బీజేపీ తన జోరు ను చూపించింది.. తెరాస కి షాక్ ఇచ్చేలా ప్రచారం అయితే చేసింది..  ఈ రెండు పార్టీ లు గ్రేటర్ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా హోరాహోరీగా ప్రచారాల్లో పోటీపడ్డాయి. ఇక కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన శక్తి కి మేర ప్రయత్నించిందని చెప్పొచ్చు..

అయితే ఇది తమ గెలుపుకు ఏమాత్రం సరిపోదు.. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ లో తుడిచిపెట్టుకుపోయినట్లే అనే పేరు వస్తుంది. నేతలు ఎవరు యాక్టివ్ గా గ్రేటర్ ప్రచారంలో పాల్గొనలేదు.. దాంతో ఇక్కడ వారు గెలిచేది కష్టమే అయినా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ లో ఇలాంటి దుస్థితి ఏర్పడడం ఆయా నేతలకు మింగుడు పడని విషయం.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఈ పార్టీ లో ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి గా ఉన్నారు.. 

అధికారపార్టీ పెద్దగా ఏమనకపోయినా బీజేపీ   కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు సిద్ధమవుతోంది. అందులోని కొంతమంది నేతలను లాగేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది..కాంగ్రెస్ నేతలు కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. దుబ్బాకలో మూడో స్థానానికి నెట్టగలడంతో బీజేపీ నేతల్లో మరింత విశ్వాసం పెరిగింది. దీంతో గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత చేరికలకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటికే బీజేపీ ఒక జాబితాను సిద్ధం చేసి పెట్టుకుంది. కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది నేతలను చేర్చుకుని తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం చేయాలన్న వ్యూహంలో ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ తెలంగాణలో కోలుకోవడం కష్టమేనన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: