టీడీపీ లో మరో పరాభవానికి టీడీపీ సిద్ధమవుతోందా..ఇక్కడ త్వరలో జరిగే ఉప ఎన్నికలో టీడీపీ కి మళ్ళీ పరాజయం తప్పదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.. ఇక్కడ టీడీపీ తరపున గతంలో బరిలోకి దిగిన పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు.. అయితే ఆమె  చంద్రబాబు కు ఈ  ఉప ఎన్నిక విషయంలో పనబాక లక్ష్మి కొంత టెన్షన్ పెట్టిందని చెప్పొచ్చు. పనబాక లక్ష్మిఎంపిక టీడీపీ వర్గాలు ఇక్కడ గెలుపు ధీమా తో ప్రచారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. కానీ అనూహ్యంగా చంద్రబాబు కు ఆమె షాక్ ఇచ్చారు..అభ్యర్థి గా అనౌన్స్ మెంట్ అయినా దగ్గరినుంచి కాలు బయటపెట్టకపోవడం టీడీపీ క్యాడర్ ను కలవరపెట్టింది.. అందుకు కారణం లేకపోలేదట..

గత ఎన్నికల సమయంలో రెండు సార్లు ఆమె పోటీ చేసి ఓడిపోయారు.. దాంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు ప్రచారానికి పెట్టలేనని ముందే చెప్పారట.. అయితే చదన్రాబాబు కూడా మొత్తం తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు ఆ హామీని పట్టించుకోకపోవడంతో ఆమె ఎదురుతిరిగారని అంటున్నారు. అయితే ఎన్ని జరిగినా అయితే పనబాక లక్ష్మి ఎంత వరకూ స్ట్రాంగ్ క్యాండిడేట్ అన్న చర్చ తెలుగుదేశం పార్టీలోనే జోరుగా జరుగుతుండటం విశేషం.

పనబాక లక్ష్మి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు. ఆమె గతంలో నెల్లూరు, బాపట్ల రిజర్వడ్ స్థానం నుంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అందరికీ తెలిసిన వ్యక్తి. ఇవే పనబాక లక్ష్మికి ప్లస్ పాయింట్లు. అయితే లోకల్ అయినా పనబాక లక్ష్మి స్థానికంగా అందుబాటులో ఉండరన్న వాదన ఉంది. ఎవరితో పెద్దగా కలవరని, క్యాడర్ ను కూడా పట్టించుకోరని గత ఎన్నికలకు ముందే ఆమె విషయంలో ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఆమెను క్యాండిడేట్ గా నిలబెట్టి పెద్ద రిస్క్ చేస్తుందని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: