తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పొచ్చు..ఇన్నాళ్లు టీ ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యంతో ఏ పార్టీ కూడా ప్రజలోకి వెళ్లలేకపోయింది.. ప్రజలకు గులాబీ పార్టీ మీద ఉన్న నమ్మకమో, లేదా కేసీఆర్ పై ఉన్న నమ్మకమో తెలీదు కానీ ప్రజలు కేసీఆర్ ని తప్పా ఎవరిని నమ్మలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని సైతం పక్కన పెట్టి కేసీఆర్ వైపు మొగ్గారు ప్రజలు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది.. రెండో సారి ఎన్నికల్లో గెలిచినా తర్వాత ఎందుకో కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వచ్చింది అనేకంటే ప్రతిపక్షాలు అలాంటి అలాంటి వాతావరణాన్ని సృష్టించాయి అని చెప్పాలి.. బీజేపీ పార్టీ ఇందులో సక్సెస్ అయ్యింది..

దుబ్బాక లో గెలిచి గ్రేటర్ లోనూ గెలవాలని ప్రయత్నాలు చేసింది.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి..నేడు ఫలితాలు రావాల్సి ఉంది. ఇక తెలంగాణ లో మరో ఆస్కాక్తికర విషయం ఏంటంటే కవిత కు మంత్రి ఇస్తారా లేదా అనే విషయం.. అయితే కవిత ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు కానీ   మంత్రివర్గంలో చేరబోతున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆమె వ్యాఖ్యలు కొంత ఆసక్తి కరంగా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో చేరుతారా అంటే ఆమె ఇంగ్లిష్ న్యూఇయరా.. ఉగాదా.. అని ఎదురు ప్రశ్నించారు. అయితే సంక్రాంతికి ముందే మంత్రిగా మారతారా అంటే ఉగాది వరకూ ఆగాలా అని మరో ఎదురు ప్రశ్న వేశారు.

 మంత్రి పదవి గురించిప్రస్తావన వస్తే.. ముందుగా ఖండిస్తే పెద్దగా ఉహాగానాలు వచ్చేవి కావు. కానీ ముందుగానే మంత్రి పదవి చేపడతానన్నట్లుగా మాట్లాడటంతో.. ఈ విషయంలో ఆమెకు క్లారిటీ ఉందన్న చర్చ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. కేసీఆర్ కుమార్తె అయిన కవితను.. సాధారణ ఎమ్మెల్సీగా ఉంచేందుకు ఇష్టపడరని. మరో ఉన్నతమైన పదవికి అప్పగించేందుకే ఎమ్మెల్సీ చేశారన్న చర్చ కొంత కాలంగా ఉంది. ఆ ఉన్నతమైన పదవి మంత్రి పదవేనని ఇప్పుడుక్లారిటీ వస్తోంది. మరి దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: