రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే విషయంలో ఇప్పటివరకు కూడా పక్షపాత వైఖరి అనుసరించింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం సహాయం చేయకుండా అనేక ఇబ్బందులు పెడుతోంది అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. కొన్ని కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడుతున్న కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయటం లేదు. కరోనా వైరస్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో కనీసం ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పరిస్థితులు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే విషయంలో ఇప్పుడు చాలా వరకు కూడా పక్షపాత వైఖరి అనుసరిస్తుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ కూడా వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఆయన కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అదేవిధంగా ఆర్థిక లోటు కూడా కోరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీ లో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో ఇప్పుడు అప్పులు కూడా తీవ్రంగా చేసే పరిస్థితి ఉంది.

ఈ విషయం కేంద్రానికి కూడా స్పష్టంగా తెలుసు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తామని చెబుతున్న సరే అనేక ఇబ్బందులు పెడుతూ ముందుకు వెళుతుంది. కాబట్టి సీఎం జగన్ కేంద్రంపై కాస్త సీరియస్ గా వ్యవహరించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఒకవేళ సీబీఐ కేసులతో తనను ఇబ్బంది పెట్టినా సరే తాను ఎక్కడా ఇబ్బంది పడే అవకాశం లేదు అనే భావనలో సీఎం జగన్ ఉన్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: