దేశంలో జమిలి ఎన్నికలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా దాదాపుగా రాజకీయ పార్టీలన్నీ కూడా దీనిపై ఇప్పుడు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని రేపొద్దున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏదైనా పరిణామంలో కూలిపోతే అప్పుడు మళ్ళీ ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుందని అంటున్నాయి.

కాబట్టి అనవసరంగా ఇబ్బందులు వస్తాయని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ సీఎంలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు ఖర్చును భరించలేని పరిస్థితి ఉంటుందని అభ్యర్థులు కూడా పోటీలో నిలవడానికి భయపడే పరిస్థితులు ఉంటాయని కాబట్టి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు సూచిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందని కాబట్టి ఒకసారి ఎన్నికల నిర్వహణ అనేది తల నొప్పిగా మారుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బలగాలు వినియోగించుకునే విషయంలో రాష్ట్రాల పోలీసు బలగాలను వినియోగించుకునే విషయంలో సమర్థవంతంగా అడుగులు వేసే అవకాశాలు ఉండకపోవచ్చని ఫలితంగా ఎన్నికల్లో అవకతవకలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. 130 కోట్ల మంది దేశ జనాభాలో ఒక్కసారిగా ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కాకపోవచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గాల్సిన అవసరం ఉందని శుభ్రంగా ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: