వైద్యరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలే దీనికి ప్రధాన కారణం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకోలేదు అని అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. తాజాగా పార్లమెంటరీ కమిటీ ఒకటి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఒక నివేదిక సమర్పించింది. వైద్యరంగంలో చేస్తున్న ఖర్చులను పూర్తిస్థాయిలో ఎండగట్టింది.

రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయంలో అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వెనకబడి ఉందని ఫలితంగా రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారీతిన ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. దీనివలన వైద్యులు కూడా ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వైద్య రంగంలో నిధులను కేటాయించే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అనే విషయాన్ని స్పష్టం చేసింది.

కేవలం 1.3 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని వెల్లడించింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాత్రం దాదాపుగా మూడు శాతం వరకు ఖర్చు చేస్తున్నాయి. కరోనా రెండో వేవ్ కనుక వస్తే మరణాల శాతం కూడా చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని నివేదికలో స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వెనుకబడి ఉండటం తో సామాన్యులకు వైద్యం అందడం చాలా కష్టంగా మారిందని, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మనదేశంలో చాలా వరకు వెనకబడిన రాష్ట్రాలను కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరానికి మందులు లేవు అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి వైద్యరంగం మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక అభిప్రాయపడింది. మరి కేంద్రం ఏం చేస్తుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: