భోపాల్ గ్యాస్ సంఘటన జరిగి ఇప్పటికి 36 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ రోజు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చనిపోయిన వారి గుర్తుగా వారి మెమోరియల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే గ్యాస్ సంఘటన లో మరణించిన వారి భార్యలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా కూడా భోపాల్ లాంటి గ్యాస్ సంఘటన జరగరాదని కోరుకుంటున్నట్లు చెప్పారు.1984 డిసెంబర్ 2,3 వ తేదీల లో జరిగిన ఈ టాక్సిక్ గ్యాస్ లీక్ వలన చాలా ప్రజల కుటుంబాలకు నష్టం కలిగిందని చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం అన్నారు. చనిపోయిన కుటుంబాలకు పెన్షన్ ఇస్తున్నామని 2019 వరకు పెన్షన్ ఇచ్చేవాళ్ళమని కానీ 2019 లో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఈ పెన్షన్ స్కీమ్ ను ఆపివేసిందని మళ్ళీ ఈ పెన్షన్ స్కీము ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. చాలా మంది ప్రజలలో ఇప్పటికి రోగాలు తగ్గలేదని ఇంకా చాలా మంది శ్వాస కోస వ్యాధుల తో భాధ పడుతున్నారని వారికి సహాయం చేస్తామని అన్నారు. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని తరువాత తరాలకు మనం ఇవ్వాలని అలాగే నిన్న భోపాల్  జిల్లాలో కరోనా వైరస్ తో 518 మంది చనిపోయారని అందులో 102 మంది భోపాల్  గ్యాస్ ఘటన వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారేనని మరియు 69 మంది యాబై సంవత్సరాల వయస్సు దాటినా వారని చెప్పారు.దాదాపుగా 15000 మంది 1984 లో జరిగిన  యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుండి   మిథైల్ ఐసోసియనట్ గ్యాస్ లీకేజీ వలన చనిపోయారని అన్నారు.అలాగే దాదాపు ఐదు లక్షల కంటే ఎక్కువ మంది అనారోగ్యం తో భాదపడ్డారని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలో మరెప్పుడు మరో భోపాల్ ఘటన జరిగ రాదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: