భారత్-చైనా సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం భారత్కు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పూర్తిగా భారత్ నుంచి చైనాను  నిషేధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికీ చైనా కు సంబంధించిన అన్ని కాంట్రాక్టులను  రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి అన్ని రకాల వస్తువులను కూడా పూర్తిగా బ్యాన్  చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అంతేకాకుండా చైనా కు సంబంధించిన యాప్స్  అన్నింటిపై కూడా భారత ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒకరకంగా చైనా పై భారత్ ఆర్థిక యుద్ధం చేస్తోంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాల నుంచి దిగుమతి లు  తగ్గించుకుని ఎగుమతులను పెంచుకోవడమే భారత లక్ష్యం అనే విధంగా ప్రస్తుతం ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోడీ వ్యూహం  క్రమక్రమంగా ఫలిస్తున్నట్టు  తెలుస్తుంది. అది కూడా ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త సృష్టిస్థితి సృష్టించి శత్రుదేశం గా కొనసాగుతున్న చైనానే ప్రస్తుతం ఒక మెట్టు కిందికి దిగి రావడంతో మోడీ ప్లాన్ ఫలించినట్లు అయింది.



 సాధారణంగా భారత్లోకి దిగుమతులను తగ్గించుకుని ఎగుమతులను పెంచే విధంగా మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఇటీవల చైనా లో ఆహార సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఏకంగా భారత్ నుంచి భారీగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చైనా ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ ధాన్యాన్ని విక్రయిస్తున్న ధర  తమ దేశ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటే రానున్న రోజుల్లో కూడా మరిన్ని ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటీవల చైనా తెలిపింది. మోదీ చైనా విషయంలో ఏదైతే జరగాలి అనుకున్నారో  ప్రస్తుతం  చైనా దిగివచ్చి భారత్ నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు సిద్ధం కావడంతో మోదీ వ్యూహం ఫలించినట్లు అయింది అని అటు విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: