చైనా ఉద్రిక్తత పుణ్యమా అని ప్రస్తుతం భారత రక్షణ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంది అనే విషయం తెలిసిందే. ఈ విధంగా సరికొత్త టెక్నాలజీతో కూడిన ఆయుధాలను అభివృద్ధి చేస్తూ వాటి ప్రయోగాలు నిర్వహించి విజయవంతం అవుతుంది. ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు దృశ్య భారత ఆర్మీని  మరింత పటిష్టవంతం చేసుకునేందుకు డి ఆర్ డి ఓ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఏకంగా 13 పైగా మిస్సైల్స్  అభివృద్ధి చూసి.. ప్రయోగాలు  చేసి విజయవంతం అయింది అన్న విషయం తెలిసిందే.



 అంతేకాదు ప్రస్తుతం భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్న మిస్సైల్స్  ఆయుధాలు అన్నీకూడా ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అదేసమయంలో ఎప్పుడు వివిధ దేశాలకు చెందిన ఆయుధాల పై ఆధారపడిన భారత్  పరిశోధన సొంతంగా ఆయుధాలు తయారీని ప్రారంభించి విక్రయాలు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో డి ఆర్ డి ఓ మరింత వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఇటీవలే మరో సరికొత్త ఇన్నోవేషన్ కి సిద్ధం అయ్యింది డి ఆర్ డి ఓ.



 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో  వాటర్ క్రాఫ్ట్  ఆయుధాలను ఆత్మ నిర్బర్  భారత్లో భాగంగా వంద శాతం స్వదేశీ నైపుణ్యంతో నిర్మించబోతున్నారు. మొత్తం 16 యాంటీ సబ్ మెరైన్  క్రాఫ్ట్ లను  భారత నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇలా శత్రు దేశాల దగ్గర ఉన్న ఆయుధాలకు మన ఆయుధాలు అడ్డుపెట్టకుండా  అధునాతన టెక్నాలజీతో శత్రుదేశాల దగ్గర ఆయుధాలను ధ్వంసం చేసే విధంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించే  విధంగా ప్రస్తుతం భారత రక్షణ పరిశోధన సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ వినూత్నమైన ఇన్నోవేషన్ తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది డి ఆర్ డి ఓ.

మరింత సమాచారం తెలుసుకోండి: