మొన్నటి వరకు గ్రేటర్ యుద్ధం కొరకు సాగిన ప్రచారాల పోరు... ఇక నిన్న ఎలక్షన్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద టెన్షన్.... మరి ఇప్పుడు ఫలితాల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి... ఇలా గ్రేటర్ యుద్ధం దశల వారీగా కొనసాగుతోంది. గెలిచేదెవరో... నిలిచేదెవరో అన్న.... ఆసక్తి ప్రతి రాజకీయ కార్యకర్తలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అన్ని పార్టీల వైపు నుండి ప్రచారాలు పెద్ద ఎత్తున జరిగినప్పటికీ... ప్రజలకు అభివృద్ధి హామీలు చూపినప్పటికీ... ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద తక్కువగానే కనబడ్డారు. ఎలాగోలా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పోలింగ్ ఘట్టం కాస్త సజావుగా ముగిసింది. కానీ హైదరాబాద్ లో ఎక్కువమంది ఓటర్లు తమ హక్కును అలాగే బాధ్యతను విస్మరించడంతో...వీరిపై మండిపడ్డ వైనం వైరల్ గా మారింది.

సైబరాబాద్ సీపీ సజ్జనార్ కూడా.. ఓటు వేయని తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం పై మండిపడ్డారు. ఓటు వేసిన వారికే ప్రశ్నించే హక్కు అంటూ. ... ప్రభుత్వ పథకాలు కూడా ఓటు వేసిన వారికి వర్తిస్తాయని అన్న ప్రతిపాదనపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ విషయంపై పలు రకాల కామెంట్లు వినిపించాయి. ఇక మెయిన్ విషయానికి వస్తే..... ఎలక్షన్ ఫలితాల గురించి వివిధ రకాల వాదనలు వినబడుతున్నాయి. ఎవరికి వారు మాదే విజయ మంటూ చెప్పుకుంటున్నారు. మరి.. నిఘా వర్గాలు తయారు చేసిన నివేదికలో ఏముంది? ప్రభుత్వాధినేతకు.. కీలకమైన వారికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్న అంశాలు ఏమిటి?  అన్న విషయం పై ఉత్కంఠ నెలకొంది.

అటు అందుతున్న వార్తలు చూస్తుంటే....గ్రేటర్ ఎన్నికలపై నిఘా వర్గాలు అందజేసిన రిపోర్టుతో ప్రభుత్వం సంతోషంగా ఉందంటున్నారు. వారు కోరుకున్న అంత కాకపోయినా... మంచి ఫలితాల్ని సొంతం చేసుకోవటం గ్యారంటీ అని వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కనిపించిన పోటీ వేళ.. అధికార పార్టీ  అంచనాలకు కాస్త అనుగుణంగానే ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ తో పాటు.. ఎగ్జిట్ పోల్ మీద ఉన్న పరిమితుల నేపథ్యంలో వివరాల్ని బయటకు ప్రకటించడం కుదరదన్న విషయం తెలిసిందే.. కాగా.. కొందరు  అంచనాలకు అందని రీతిలో.. నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు లెక్కలు తేలాలంటే.. మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: