అన్ని కరోనా వ్యాక్సిన్‌ లు ఒకేలా పనిచేయవు.. ఆ మాటకొస్తే చెప్పినంత ఘనంగా పలితాలుంటాయనే నమ్మకం లేదు. జరిగిందే అరకొర ప్రయోగాలు.. ఏళ్లకేళ్లు పట్టే ట్రయల్స్‌ ని నెలలకు కుదించటం, మార్కెట్‌ క్యాప్చర్‌ చేయటం కోసం ఆకర్షణీయమైన ప్రకటనలు ఇవ్వటం చేస్తున్నాయి ఫార్మా కంపెనీలు. అయితే ఇప్పుడు అందుబాటులోకొస్తున్న ఫైజర్‌ పై మాత్రం భారీగానే అంచనాలున్నాయి.

ప్రపంచంలోని ఎన్నో దేశాలు కరోనాను నిరోధించే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు పరుగులు పెడుతున్నాయి. ఈ దిశగా దాదాపు అన్ని కంపెనీలూ ఇండియాకు చెందిన ఏదో ఒక ఫార్మా సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండియాకు చెందిన 11 సంస్థలు వ్యాక్సిన్ ట్రయల్స్‌ లో బిజీగా ఉన్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొత్తం ఐదు వ్యాక్సిన్లపై పరిశోధనలు చేస్తోంది. వీటిలో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ ముఖ్యమైంది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పుడు రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. అయితే కోవిషీల్డ్‌ పై వలంటీర్ చేసిన ఆరోపణలపై సీరం ఇన్స్టిట్యూట్ స్పందించింది. తమ  వ్యాక్సిన్ సురక్షితమైనదని.. ఇమ్యూనోజెనిక్ అని తెలిపింది. అన్ని రకాల జాగ్రత్తల తర్వాతే తాము ట్రయల్స్ నిర్వహించామని క్లారిటీ ఇచ్చింది.

ఇక భారత్ బయోటెక్ విషయానికి వస్తే, ఈ సంస్థ మూడు వ్యాక్సిన్లను పరిశీలిస్తోంది. పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ ల సహకారంతో తయారుచేసిన కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉంది.

ఇక జైడస్ కాడిలా సంస్థ సొంతంగా పరిశోధించి తయారు చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, రష్యాకు చెందిన గమేలియా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తోంది. మొత్తానికి ఫైజర్ వ్యాక్సిన్ పై ప్రజల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: