మరికాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది.రాజకీయ పార్టీలు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలు కానుంధి.మద్యాహ్నం 12 గంటల లోపు తొలి ఫలితం విడుదల కానుంది.ఈ నేపథ్యంలో అసలు బ్యాలెట్ పేపర్ల ఓట్ల లెక్కింపు పద్దతి ఎలా ఉంటుంది.అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.ఒక్కసారి కౌంటింగ్ పూర్తయిన తరువాత మరలా కౌంటింగ్ చేపట్టే అవకాశాలు వున్నాయా..ఇలాంటి వాటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు గ్రేటర్ పరిధి లోని 30 సెంటర్లలో ప్రతి డివిజన్‌కు ఒకటి చొప్పున 150 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు.

 అయితే 16 డివిజన్లకు మాత్రం రెండు హాల్స్‌ చొప్పున సిద్ధం చేసినట్టు సమాచారం.ఒక్క హాలుకు సంభంధించి 14 టేబుళ్లలో ఓట్లు లెక్కించే అవకాశం ఉంది..ముందుగా పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి  25 బ్యాలెట్ పేపర్లను కలిపి ఒక కట్టగా కడతారు . అలాగే ఆ బ్యాలెట్ పేపర్లు పోలైన ఓట్లకు సమానంగా ఉన్నాయా, లేదా, అన్నది ఒకటికి రెండు మార్లు పరిశీలిస్తారు. 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కట్టిన తరువాత మిగిలే ఓట్లును అంటే 25 కంటే తక్కువగా వున్న వాటిని మరొక కట్టగా కట్టి వాటిని ఒక బాక్స్ లో వేస్తారు.ఇలా డివిజన్‌ పరిధిలోని అన్ని ఓట్లను ఇలాగే  కట్టిన తరువాత వీటన్నిటిని ఒక డ్రమ్ములో వేసి కలుపుతారు.

ఇలా ఎందుకు కలుపుతారంటే ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలు తెలియకూడదనే ఇలా చేస్తారట.అయితే దాదాపు ఈ ప్రక్రియ పూర్తవడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాతే కౌంటింగ్‌ మొదలవుతుంది.బ్యాలెట్ పేపర్ మీద వున్న గుర్తు ఆధారంగా ఓట్లను ఒక్కో డబ్బాలో వేస్తారు. తర్వాత వాటిని లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయన్నది తేలుస్తారు. మొత్తం బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రక్రియ ఇలానే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉండే ఏజెంట్లు కోరితే మరోసారి ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: