జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అభ్యర్థులు అందరిలో టెన్షన్ నెలకొంది. అటు అన్ని పార్టీలలో కూడా టెన్షన్ నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అభ్యర్థులందరూ భారీగానే ఖర్చు పెట్టారు ఇక పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా భారీగా ఖర్చుపెట్టి ముమ్మర ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తుందా లేదా అని ప్రస్తుతం టెన్షన్ టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.



 అయితే మొన్నటి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన అభ్యర్థులకు సంబంధించిన జాతకాలు నేడు తేలిపోనున్నాయి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రచారం చేపట్టిన అభ్యర్థులు ఏమేరకు ప్రజలను ఆకర్షించారు అన్నది నేడు ఫలితాలలో తేలనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నేడు జరుగుతున్న ఓట్ల కౌంటింగ్ పై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల చూపు  మొత్తం జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ మీద ఉన్న విషయం తెలిసిందే.



 గతంలో దుబ్బాకలో అనూహ్యంగా ఊహించని విధంగా బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో ఇక ఈ సారి కూడా బిజెపి విజయం సాధిస్తాము  అంటూ ధీమా వ్యక్తం చేసింది.  ఈ క్రమంలోనే  జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితం ఎవరికి ఫేవర్ గా వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించ నుందా  లేదా దుబ్బాకలో లాగానే సీన్ రిపీట్ అయి జీహెచ్ఎంసీ ఎన్నిక లో బీజేపీ గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా  అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అంతా హాట్ హాట్ గా మారిపోయింది వాతావరణం.

మరింత సమాచారం తెలుసుకోండి: