గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయింది. సర్వే ఫలితాలలో అసలు ఆ పార్టీ పేరు కూడా ఎక్కడా కనబడలేదు. తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వ పనితీరు దీనికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం అసలు ఏమాత్రం కూడా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోవడం ప్రచారంలో కూడా పాల్గొన లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్లు ప్రచారం చేయక పోవడంతో కాంగ్రెస్ పార్టీ తరహాలోనే తెలుగుదేశం పార్టీ కూడా ఘోరంగా వెనకబడిందని చెప్పవచ్చు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు. బాలకృష్ణ ప్రచారం చేస్తారని భావించిన ఆయన కూడా ప్రచారం చేయలేదు. అంతే కాకుండా రాష్ట్ర స్థాయి నేతలు నలుగురైదుగురు నేతలు కూడా పెద్దగా ప్రచారం చేయకపోవడంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా వెనకబడింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బిజెపి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని కూడా లాక్కుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకు వెళ్లకపోయినా భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లి పోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా ఓటమి పాలు కావడంతో ఇక ఆ పార్టీకి భవిష్యత్తు తెలంగాణలో లేదు అనే భావన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు టిఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇటు వెళ్ళారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఇక ఆ పార్టీ భవిష్యత్తు లేనట్లే అనేది చాలా మంది మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: