ఏపీ రాష్ట్రంలో తనను తాను ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు.. ఎందుకంటే అయన రాష్ట్రంలో ఏ మంచి పని జరిగిన తన ఖాతాలోనూ, చెడు ని జగన్ ఖాతా లో వేస్తూ పబ్లిసిటీ స్టెంట్స్ నిర్వహిస్తూ ఉంటాడు.. రాష్ట్రం విడిపోయాకకూడా చంద్రబాబు తెలంగాణ తనవల్ల అభివృద్ధి అయ్యిందని, అక్కడ హైటెక్ సిటీ కట్టింది తనదే అని పబ్లిసిటీ భీభత్సంగా నిర్వహించారు.. ఏదేమైనా ఈ పబ్లిసిటీ వైఖరి చంద్రబాబు ను కొంతవరకు కాపాడిన ఎప్పుడూ ఇదే వర్తింపు కాదు.. అన్ని సార్లు దీనికి ప్రజలు లొంగరు. అందుకు ఉదాహరణే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు..

చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే జగన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నారు.. ఆయన అస్సలు పబ్లిసిటీ అంటేనే అమడదూరంలో ఉంటున్నారు. ఇప్పుడే కాదు మొదటినుంచి  జగన్ ప్రచారాన్ని పెద్దగా కోరుకోవడం లేదు. గెలిచిన దగ్గరినుంచి అయన పెద్దగా ప్రచారం చేసుకోవటంలేదు. అంది వచ్చిన అవకాశాన్ని కూడా జగన్ ఉపయోగించుకోవడం లేదు. చంద్రబాబు మాదిరిగా నిత్యం వార్తల్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. అయితే ఇది దేనికి దారి తీస్తుంది అనేది తెలియట్లేదు.. ఓ వైపు ప్రతిపక్షంలో ఉండి  కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అమలు చేస్తున్న పథకాలు తనవే అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు చంద్రబాబు..

అయితే తన పథకాలకు తానే జగన్ మాత్రం చిన్న ప్రచారం కూడా చెయ్యట్లేదు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి పదిహేడు నెలలు కావస్తుంది. ఈ పదిహేడు నెలల్లో జగన్ అనేక సంక్షోభాలను చూశారు. సమస్యలను అధిగమించారు. కానీ ఎక్కడా మితిమీరిన ప్రచారాన్ని చేయలేదు ఇకపై కోరుకోవడం లేదు. తాజాగా నివర్ తుపాను వచ్చినప్పుడు కూడా జగన్ ఎలాంటి ఆర్భాటానికి పోలేదు. తుపాను హెచ్చరికలతో జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. అతిగా ప్రచారం అనర్థానికి దారితీస్తుందన్న సూచనలతోనే జగన్ వాటికి దూరంగా ఉంటున్నారని పార్టీ సీనియర్ నేతలు చెబుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: