తెలంగాణాలో వరుస ఎన్నికలు రాజకీయంగా ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు పూర్తి అయ్యాయి.. దుబ్బాక లో బీజేపీ విషయం సాధించగా, గ్రేటర్ లో తెరాస విజయ ఢంకా మోగించింది.. ఈ నేపథ్యంలో మరో ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది..నాగార్జున సాగర్ నియోజక వర్గంలో అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది..

ఇక ఇక్కడ గెలుపుకోసం అన్ని పార్టీ కసరత్తు లు మొదలుపెట్టాయి.. గ్రేటర్ బాటలను అసెంబ్లీకి విస్తరించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న బీజేపీకి తాజా పరిణామాలు కొత్త ఆశలు నింపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను కాషాయ పార్టీ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. దుబ్బాక లో విజయ కేతనం ఎగరవేసినట్టుగానే ఇక్కడ ఎగురవేయాలని చూస్తుంది.. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఓడిపోయినా వారు ప్రదర్శించిన దూకుడు కు ప్రజలు ఫిదా అయిపోయారు. ఇక్కడ కూడా కమల దళం గెలిచి కీ పొజిషన్ కు చేరుకోవాలని చూస్తున్నారు.

ఇక ఇక్కడ మళ్ళీ బీజేపీ, తెరాస లకే పోటీ  రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది.. కాంగ్రెస్ పార్టీ కి అంత బలం ఇక్కడ లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన జానారెడ్డి నోముల చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ మరింత కుదేలయ్యింది. ఎక్కడా అధికార టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చే స్థాయిలో కనిపించడం లేదు. కాస్తో కూస్తో పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలింది. కాంగ్రెస్ తరుపున గెలిచిన నక్రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎప్పుడో కారెక్కారు. ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ లోక్ సభకు ఎన్నికకావడంతో హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ గులాబి పార్టీయే గెలుపును సొంతం చేసుకుంది. ఇలా... క్రమంగా కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోతుండడం ఇప్పుడు బీజేపీకి కలిసొచ్చే విషయంగా మారింది. మరి నాగార్జున వాకిల్లో కారు జోరు చూపిస్తుందా లేదా కమలం వికసిస్తుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: