హైదరాబాద్ లో ఏ ఎలక్షన్స్ అయినా ప్రజలు చాల తక్కువ పోలింగ్ వచ్చేలా ఎంతో జాగ్రత్తగా ఓట్లేస్తారు.. ఇంతవరకు జరిగిన ఏ ఎలక్షన్స్ లో అయినా  యావరేజ్ గా యాభై శాతం పోలింగ్ నమోదు కావట్లేదు అంటే ప్రజలు రాజ్యాంగం పట్ల ఎంత నిజాయితీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. ఓట్లు అయితే వేయరు కానీ పథకాలకు మాత్రం చేతులు చస్తారు.. పైగా మాకు ఆ అన్యాయం జరిగిందని ఈ అన్యాయం జరిగిందని రోడ్డు మీదకొస్తారు.. ఓటు వేయని వాడికి అడిగే అధికారం లేదని హక్కును సృష్టిస్తో వందకు వంద శాతం ఓటింగ్ నమోదు అవుతుందేమో..

ఇక గ్రేటర్ లో కూడా మనోళ్లు 45 శాతం ఓటింగ్ నమోదు చేసి మరోసారి రికార్డులకెక్కారు. రాజకీయ పార్టీ ఎంత మొత్తుకున్నా ప్రజలు చీమ కుట్టినట్లు కూడా అనిపిన్చడంలేదు.. పైగా ఓటు వేయకపోవడం ఓ ఫ్యాషన్ గా మారింది కొందరికి.. అయితే ప్రజల్లో ఉన్న ఈ భావం పార్టీ లలో కొంత ఆందోళన కలిగిస్తుంది. వారి ఒక్క ఓటు మొత్తం రాజకీయ పరిస్థితి ని మార్చేస్తుంది..అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు.. ఇక గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ తగ్గడం కేటీఆర్ చలవే అంటున్నారు ప్రతిపక్ష నాయకులూ.. పోలింగ్ శాతం తగ్గాలనే కేసీఆర్ వరస సెలవులు చూసి ఎన్నికలను పెట్టారని బీజేపీ ఆరోపిస్తుంది. అందుకే హైదరాబాదీలు గ్రామాలకు వెళ్లారని, ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని బీజేపీ చెబుతోంది. కావాలనే పోలింగ్ శాతం తగ్గేలా చేశారంటోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  అయితే పోలింగ్ శాతం తగ్గడంతో కొంత ఊపిరిపీల్చుకుంది. పోలింగ్ శాతం తగ్గడం అధికార పార్టీకి లాభమేనని అంచనా వేస్తున్నారు. ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని ఎన్నికల నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే కేటీఆర్ స్వయంగా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలు ఏంటనేవి నివేదికలు రప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలతో కేటీఆర్ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కౌంటింగ్ వద్ద కూడా అప్రమత్తంగా ఉండేలా ఏజెంట్లను పంపాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: