తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసింది.. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి గా ఎన్నికై కేసీఆర్ ని ప్రజలు ఎంతలా నమ్మారో చెప్పారు.. దాంతో కేసీఆర్ కి రాష్ట్రంలో ఎదురులేనట్లుగా అయ్యింది.. అయితే అధికారం మొత్తం కేసీఆర్ కి ఇవ్వడంతో అయన కొంత విచ్చలవిడిగా పరిపాలన చేయడం మొదలుపెట్టారు.. అయితే అది గమనించిన ప్రజలు దుబ్బాక లో చిన్న వార్నింగ్ ఇచ్చారు..  ఇక్కడ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది..

ముందు నుంచి ఇక్కడ గులాబీ పార్టీ దే విజయం అనుకున్నారు అంతా కానీ రఘు నందన్ రెడ్డి ని  స్వల్ప మెజారితో గెలిచారు.. రాష్ట్రంలో రాజకీయ చాణక్యుడు గా కేసీఆర్ కి మంచి పేరుంది. అయన వ్యూహం రచిస్తే ఎంతటి ఎన్నికల్లో అయినా పార్టీ గెలవక తప్పదు.. అయితే తొలిసారి రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది.. దుబ్బాక లో ఓడిపోవడం కేసీఆర్ కి ఒకవిధంగా అవమానం లాంటిదే.. గ్రేటర్ లో ఓడిపోతామా అన్న సీన్ క్రియేట్ చేశారు బీజేపీ పార్టీ..

అయితే తెరాస కే ప్రజలు మరో సారి ఛాన్స్ ఇవ్వాలని చూశారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెరాస దే విజయమని అంటున్నారు.. అయితే దుబ్బాక నుంచి గ్రేటర్ వరకు కేసీఆర్ వచ్చిన మార్పు కారణంగానే ప్రజలు కేసీఆర్ ని మళ్ళీ నమ్మరు అంటున్నారు.. మొత్తానికి దుబ్బాక ఓటమితో కేసీఆర్ గుణపాఠం నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. తొలుత దుబ్బాకలో ఎదురుదెబ్బ కారణంగా ఆయన తేరుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బహిరంగసభ నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. గతంలోకంటే పార్టీ మెరుగ్గా పనిచేస్తుందని హామీ ఇచ్చారు.. దీంతో కేసీఆర్ లో మార్పు వచ్చిందని ప్రజలు ఓటేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: