ఉత్కంఠగా సాగిన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ  ప్ర‌శాంతంగా సాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జ‌రుగుతోంది. దాదాపు ఈ ప్ర‌క్రియ కూడా చాలా చోట్ల పూర్త‌యింది. ఈ బ్యాలెట్ ఓట్ల‌లో బీజేపీ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. టీఆర్ ఎస్ పార్టీ రెండో స్థానంలో నిల‌వ‌గా, ఎంఐఎం మూడోస్థానంలో కాంగ్రెస్ నాలుగో స్థానంలో  ఉన్నాయి. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం... జగద్గిరిగుట్టలో బీజేపీకి 1, టీఆర్ఎస్ 1, మూడు చెల్లని పడ్డాయి. చింతల్‌లో బీజేపీకి 2 ఓట్లు రాగా మరో రెండు ఓట్లు చెల్లలేదు. వనస్థలిపురం: బీజేపీకి 5, టీఆర్ఎస్ 2 నోటా 1, చంపాపేట: బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1, హస్తినాపురం: బీజేపీ 2, చెల్లనివి 5, లింగోజిగూడెం: బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1, టీజేఎస్ 1, రంగారెడ్డి‌నగర్: బీజేపీ 3, టీఆర్ఎస్ 2, గచ్చిబౌలి: టీఆర్ఎస్ 1, చెల్లనివి 2, కొండాపూర్‌లో బీజేపీ 5, టీఆర్ఎస్ 1, నోటా 1, చెల్లనివి 7, రామంతాపూర్: బీజేపీ 8, టీఆర్ఎస్ 2, ఉప్పల్ : బీజేపీ 10, కాంగ్రెస్ 4, మాదాపూర్ బీజేపీ 2, టీఆర్ఎస్ 2, మియాపూర్ 2, కాంగ్రెస్ 1, బీజేపీ 1, హఫీజ్ పేట: బీజేపీ 4, చందానగర్‌లో బీజేపీకి 2, టీఆర్ఎస్ 1, చెల్లనివి 2 ఓట్లు పడ్డాయి. మొత్తంగా  జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది


ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. గ్రేటర్ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పడిన మెహదీపట్నంలో తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ డివిజన్లో అత్యల్పంగా 11,818 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ డివిజన్ ఫలితమే త్వరగా వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉండ‌గా ఎలక్షన్ కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ల పై స్వస్తిక్ మార్క్ తప్ప మిగతా ఏదైనా పెన్ను మార్కు, ఇంకు మార్కు ఉంటే వాటిని వాలిడ్ ఓట్లుగా పరిగణించరాదని ఎన్నికల సంఘానికి తేల్చిచెప్పింది. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది.


 కాగా, బ్యాలెట్ పేపర్‌లో పెన్ను మార్క్‌ను కూడా ఓటుగా పరిగణిస్తామని ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ పై బీజేపీ పార్టీ శనివారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పు పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: