బల్దియా ఎలక్షన్స్ లో తెరాస గెలుపు దాదాపు ఖాయమని తెలుస్తుంది.. టీ ఆర్ ఎస్ పార్టీ కి ప్రజల మద్దతు ఉందని అన్ని పోలింగ్ సర్వేలు తేల్చి చెప్పాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కొంత అయోమయం నెలకొన్నా టీ ఆర్ ఎస్ పార్టీ ముందంజ లోఉండడం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. బీజేపీ బలోపేతం తో తెరాస కి కష్టాలు తప్పవని అనుకున్నారు.. కానీ తెరాస పార్టీ నమ్మకం ప్రజల్లో చెక్కు చెదరలేదని తెలుస్తుంది..దుబ్బాకలో బీజేపీ గెలుపు గాలివాటం అని తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు..

అయితే గతంలో వంద సీట్లు కు ఒకటి తక్కువ గా గెలుచుకున్న తెరాస పార్టీ ఈ సారి అన్ని సీట్లు రావడం కష్టమని అంటున్నారు.. బీజేపీ కొంత ప్రభావం చూపడం, కాంగ్రెస్ కి కూడా కొంత ఫాలోయింగ్ ఉండడంతో తెరాస కి ఈ సారి టఫ్ ఫైట్ అయితే వచ్చింది.. అన్ని స్థానాలకు ఎన్నికలు ముగియడంతో గురువారం సాయంత్రం నుంచే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన పలు ప్రముఖ సర్వేల్లో రాజకీయ పార్టీల వారీగా 5-10 స్థానాల వరకూ తేడా కనిపిస్తోంది. అయితే అన్ని పోల్స్ సర్వేలు కూడా జీహెచ్ఎంసీలో మెజారిటీ డివిజన్లను టీఆర్ఎస్‌కే గెలుచుకుంటుందని, మేయర్ స్థానం కూడా ఆ పార్టీకే కొనసాగుతుందని స్పష్టం చేశాయి.

అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనంతర ఇతర పార్టీలు ఎంఐఎం, బీజేపీ పార్టీ లు ఎలా ఆలోచిస్తాయో ఆసక్తి కరంగా మారింది. ప్రస్తుతం బీజేపీకి నలుగురు కార్పొరేటర్లు ఉండగా.. అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 12-35 వరకూ సీట్లు వచ్చే అవకాశముంది. జాతీయ నాయకుల ప్రభావం ఏమైనా పనిచేస్తే 20 సీట్లకు అటుఇటుగా వస్తాయని సాధారణ అంచనా వేస్తుంన్నారు.ఎంఐఎం పరిస్థితి కూడా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం 44 సిట్టింగ్ కార్పొరేటర్లున్న ఆ పార్టీ.. 51 స్థానాల్లో పోటీ చేసింది. అయితే కొత్త స్థానాలు గెలవడం అటుంచి ఉన్న స్థానాలను కోల్పోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఘోషిస్తున్నాయి. ఆ పార్టీ గరిష్టంగా 41 స్థానాలకు పరమితమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్‌కు 65-70 స్థానాలు వస్తుండగా.. ఎంఐఎం మద్దతుతో మేయర్ సీటును కూడా దక్కించుకోనుంది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: