గ్రేటర్ ఎన్నికల పర్వంలో అసలైన ఘట్టం రానే వచ్చింది.. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది.. ఇప్పటికే గెలుపుకోసం తెలంగాణ లోని అన్ని పార్టీ లు విరివిగా ప్రచారం చేశాయి.. అయితే నేడు గెలుపు ఎవరిదో తేలనుంది.. ఈ రోజు సాయంత్రానికల్లా బల్దియా లో రారాజు ఎవరో తేలనుంది.. ఈనెల 1 న పోలింగ్ పూర్తి కాగా నాల్గునా అంటే నేడు కౌంటింగ్ జరుగుతుంది.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో అధికార తెరాస పార్టీ దే గెలుపు అని తెల్లగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ఈమేరకు ప్రభావం చూపుతాయి నేడు తేలుతుంది.

పార్లమెంట్ ఎన్నికలో నాలుగు స్థానాలు వచ్చిన దగ్గరినుంచి బీజేపీ పార్టీ రాష్ట్రంలో కొంత దూకుడు ప్రదర్శిస్తుంది.. దానికి తోడు దుబ్బాక ఉప ఎన్నికలోనూ జయభేరి మోగించింది.. దాంతో బీజేపీ పార్టీ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై తప్పకుండ ఉంటుందని అందరు భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు రిజల్ట్స్ వారికి ఆశాజనకంగా వస్తాయో రావో అన్నది చూడాలి.. కాంగ్రెస్ పార్టీ పై ముందునుంచి ఎలాంటి అంచనాలు లేవు. అయితే ఆ పార్టీ ని తక్కువ చూడడానికి ఏమీ లేదు..

ఇక పోలింగ్ శాతం గతంలోకంటే కొంత మెరుగుపడినప్పటికీ తక్కువ పోలింగ్ అయిందని చెప్పాలి.. కనీసం ఓటర్ల లిస్ట్ లో యాభై శాతం కూడా ఓట్లు నమోదు కాలేదు 45 శాతం ఓట్లే పోలయ్యాయి..గ్రేటర్‌లోని 150 డివిజన్లలో మొత్తం పోలింగ్‌ శాతం 46.55 కాగా, 62 డివిజన్లలో 50 శాతం లోపు, 48 డివిజన్లలో 45 శాతంలోపు పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా ఓట్లు పోలైన డివిజన్లలో ఎవరి కొంప మునుగుతుందో అన్న చర్చ జరుగుతోంది.  ఈ డివిజన్లలో ఫలితం తప్పకుండా ప్రభావం చూపుతుందని అంటున్నారు..కొన్ని డివిజన్లలో 40 శాతంలోపు పోలింగ్‌ నమోదైంది. ఈ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. పోలింగ్‌ మాత్రం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గెలుపోటముల తేడా పెద్దగా ఉండదని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: