జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది అయితే ఇక డివిజన్ల వారీగా ప్రస్తుతం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక పటిష్ట బందోబస్తు మధ్య ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. అంతేకాకుండా సీసీ కెమెరాల నిఘా లో ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.



 ఇదిలా ఉంటే... ఇక మొదటి రౌండ్ నుంచి కూడా బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది టిఆర్ఎస్ కు మరోసారి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో బిజెపి 72 స్థానాల్లో ముందంజలో ఉండగా టిఆర్ఎస్ కేవలం 32 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతూ ఉండటం గమనార్హం ఇక ఎంఐఎం పార్టీ 17 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా దుబ్బాకలో సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని ప్రస్తుతం లెక్కలు చూస్తూ ఉంటే తెలుస్తోంది. బిజెపి టిఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వబోతున్న ట్లు ప్రస్తుతం ఫలితాలు చెబుతున్నాయి



 అయితే మొన్నటికి మొన్న విడుదలైన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు భారీ మెజారిటీ సాధించి టిఆర్ఎస్ మరోసారి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అని ఫలితాలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం నిజమైన ఫలితాలతో  మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు   తారుమారు అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ను టిఆర్ఎస్ గెలుస్తుంది అని వస్తే,,  ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉంది. దీంతో ఏ క్షణం లో ఎలాంటి ట్విస్ట్ బయటపడుతుందో అని ప్రస్తుతం అభ్యర్థులందరూ ఎంతో టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: