తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు బయటికి వెళ్ళే అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పార్టీ మారతారా... ఏంటనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో కనబడటం లేదు అనే విషయం చెప్పవచ్చు. అయితే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉండటానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. శాసనసభ సమావేశాలకు గంటా శ్రీనివాసరావు రాగా ఆయనతో చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు సమావేశమయ్యారని టాక్.

పార్టీ లో ఉండాల్సిన అవసరం ఉందని భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిన ఆ పార్టీ తర్వాత అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు అని చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావుతో చెప్పినట్లుగా సమాచారం. దీంతో గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారే అంశానికి సంబంధించి ఆలోచనలో పడ్డారని అంటున్నారు. అయితే ఆయనకు బీజేపీ నేతల నుంచి కూడా ఆఫర్లు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. మరి గంటా శ్రీనివాసరావు బీజేపీ లో వెళ్తారా లేదా అనేది చూడాలి.

ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర ఎమ్మెల్యే గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా అలాగే ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక పార్టీలో చేరవచ్చు అని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిన తనకు ప్రాధాన్యత ఉండదు అని... మంత్రి అవంతి శ్రీనివాస్ కారణంగా ప్రాధాన్యత దక్కే అవకాశాలు ఉండకపోవచ్చు అని ఆయన భావిస్తున్నారట. మరి ఆయన పార్టీ మారతారా లేదా అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు దేశం స్థానిక ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆ పార్టీలో ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: